సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన నయనతార ఆస్తులు 200 కోట్లకు పైమాటే అట. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నశిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ వంటి నటీమణుల్లో నయనతార కూడా ఉన్నారు. నయన్ దగ్గర 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. ఇందులో నయన్ తో పాటు.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రలకు దీన్ని ఉపయోగిస్తారని సమాచారం.