నా కవల పిల్లల గురించి ఆయనకి ముందే తెలుసేమో.. ఫన్నీ మీమ్స్ పై నయనతార రియాక్షన్

Published : Dec 21, 2022, 11:35 AM IST

ఇటీవల నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.  

PREV
16
నా కవల పిల్లల గురించి ఆయనకి ముందే తెలుసేమో.. ఫన్నీ మీమ్స్ పై నయనతార రియాక్షన్

ఇటీవల నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. ఈ సంఘటన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.   

 

26

పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.  ఎలాగోలా నయన్, విగ్నేష్ దంపతులు ఈ వివాదాన్ని అధికమించగలిగారు. అయితే నయనతారకి వివాహం కావడం, కవల పిల్లలు జన్మించడంపై అదుర్స్ చిత్రంలోని సన్నివేశాలతో ఎన్నో మీమ్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

 

36

నయనతార నటించిన లేటెస్ట్ మూవీ కనెక్ట్ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. నయనతార ఎప్పుడూ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనదు. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రం కోసం నయన్ తాన్ రూల్ ని బ్రేక్ చేసింది. తెలుగులో యాంకర్ సుమతో నయనతార ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో నయన్ కనెక్ట్ మూవీతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అనేక విషయాలు పంచుకుంది. 

 

46

నయనతారకి కవల పిల్లలు జన్మించడంతో అదుర్స్ చిత్రంలోని సన్నివేశాలు మీమ్స్ రూపంలో తెగ వైరల్ అయ్యాయి. అదుర్స్ మూవీలో నయన్, బ్రహ్మానందం మధ్య సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. బ్రహ్మి ఈ చిత్రంలో బిట్టు పాత్రలో నటించారు. నయన్ విగ్నేష్ వివాహం జరిగినప్పుడు.. బిట్టు బాధపడడం.. పిల్లలు పుట్టినప్పుడు వారిని ఆడించడం లాంటి అంశాలని అదుర్స్ చిత్రంలో లింక్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. 

 

56

ఆ మీమ్స్ ని సుమ నయనతారకి చూపించడంతో ఆమె ఎంతో సరదాగా ఫీల్ అయింది. ఆ మీమ్స్ చూసి నవ్వుకుంది. అదుర్స్ చిత్రంలో కూడా నయన్ కి చివర్లో కవల పిల్లలు పుడతారు. వారిని బ్రహ్మి ఎత్తుకుని ఆడిస్తాడు. 

 

66

అదుర్స్ చిత్రంలో, రియల్ లైఫ్ లో మీకు కవలపిల్లలు జన్మించడం యాదృచ్చికంగా జరిగింది. దీనిపై నయనతార స్పందిస్తూ.. బహుశా నాకు కవల పిల్లలు పుడతారని వివి వినాయక్ సర్ కి ముందే తెలుసేమో అని నయనతార సరదాగా అంటుంది. 

 

click me!

Recommended Stories