సరోగసి వివాదంపై త్వరలో విచారణ.. తప్పించుకునేందుకు నయనతార, విగ్నేష్ తెలివిగా ఏం చేశారంటే..

First Published Oct 13, 2022, 11:10 PM IST

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. 

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.  నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.   

పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొందరు ఇది బ్యాన్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది. 

నయనతార, విగ్నేష్ శివన్ దంపతులపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దీనిపై తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రహ్మణ్యన్ స్పందించారు. సరోగసి విషయంలో వివరణ ఇవ్వాలని నయనతార దంపతులని కోరినట్లు ఆయన తెలిపారు. 

తాజాగా విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. తొలిదశ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అయితే నయన్, విగ్నేష్ లని కూడా విచారణకి పిలుస్తారు. 

అయితే ఈ విచారణలో నయనతార, విగ్నేష్ దంపతులకు అంతగా సమస్యలు ఉండకపోవచ్చు అనే వాదన వినిపిస్తోంది. నయనతార పిల్లలకు జన్మనిచ్చిన సరోగేట్ మదర్ దుబాయ్ లో ఉంటోందట. నయన్ సోదరుడు ఆమెని ఒప్పించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో సరోగసి కి సంబంధించిన ఎలాంటి నిబంధనలు లేవు. కాబట్టి నయన్, విగ్నేష్ లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు. 

సరోగేట్ మదర్ దుబాయ్ లో ఉండొచ్చు కానీ.. పిల్లలని పొందిన నయన్, విగ్నేష్ లది ఇండియానే కాబట్టి పెద్దగా ఈ విషయంలో వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చు అని మరికొందరు అంటున్నారు. మరి నయన్ సరోగసి వివాదం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుందో చూడాలి. 

click me!