Nayanthara: పూలమాలలతో గుడిలో నయనతార, విగ్నేష్ శివన్.. వైరల్ అవుతున్న ఫోటోస్

Published : Apr 03, 2022, 04:59 PM IST

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది.

PREV
16
Nayanthara: పూలమాలలతో గుడిలో నయనతార, విగ్నేష్ శివన్.. వైరల్ అవుతున్న ఫోటోస్
Nayanthara

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. 

26
Nayanthara

ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు Vignesh Shivan తో చాలా కాలంగా నయనతార ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మరికొన్ని నెలల్లో నయనతార, విగ్నేష్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ప్రేమికులంటే ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ నయన్, విగ్నేష్ మాత్రం గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. 

36
Nayanthara

తాజాగా విగ్నేష్ శివన్, నయనతార జంట మైలాపూర్ లోని శ్రీ సాయిరాం టెంపుల్ ని సందర్శించారు. దీనితో గుడి వద్ద జనసందోహంగా మారింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ చేతిలో పూల మాలలతో కనిపించారు. దీనితో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

46
Nayanthara

అయితే గుడిలో దేవుడికి పూజ చేయడానికి నయనతార, విగ్నేష్ జంట ఆ పూలమాలలు తెచ్చుకున్నారు. చాలా కాలంగా నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ ఇలా పలు ప్రాంతాల్లో దేవాలయాలని సందర్శిస్తున్నారు. దీనిపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. 

 

56
Nayanthara

నయనతార తన జాతకం ప్రకారం పలు ఆలయాల్లో పూజలు చేయించుకుంటోంది అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పూజలన్నీ పూర్తయ్యాక విగ్నేష్ శివన్, నయన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

66
Nayanthara

ప్రస్తుతం నయనతార విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే 'కణ్మణి రాంబో ఖతీజా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

 

click me!

Recommended Stories