నయనతార.. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా, హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ నటిగా తనేంటో నిరూపించుకుంటోంది. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.
నయనతార అంటే ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్. గ్లామర్‌కి కేరాఫ్ అనే పేరు వినిపించేది. హాట్ అందాలతో కుర్రాళ్లకి కనువిందు చేసేదనే నానూడి అందరిలోనూ ఉండేది. కానీ తాను జస్ట్ హీరోయిన్ కాదు, తాను స్పెషల్ అని నిరూపించుకుంది. అదే తరహాలో రాణిస్తుంది. అభిమానుల చేత లేడీ సూపర్‌స్టార్‌గా పిలిపించుకుంటుంది. కేవలం అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆమెని లేడీ సూపర్‌స్టార్‌గానే భావిస్తుండటం విశేషం.
27
nayanathara latest photos
ఓ రెగ్యూలర్ హీరోయిన్ నుంచి లేడీ సూపర్‌స్టార్‌గా ఎదగడమంటే మామూలు విషయం కాదు. హీరో డామినేటెడ్ చిత్ర పరిశ్రమలో హీరోని దాటుకుని, సూపర్ స్టార్‌గా ఎదిగిందంటే నిజంగా నయనతార గట్స్ కి జేజేలు కొట్టాల్సిందే. ఈ రకంగా ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి సరైన అర్థాన్నిస్తుంది. నేటితరం మహిళలకు, అమ్మాయిలకు మార్గదర్శకంగా నిలుస్తుంది నయనతార.
37
nayanathara latest photos
తన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంది నయనతార. అంత ఆశామాషీగా ఆమె ఎదగలేదు. ఎన్నో ఆటుపోట్లని చవిచూసింది. నటిగా కిందపడుతూ లేస్తూ కెరీర్‌ని సరైన్ ట్రాక్‌ఎక్కించింది. మరోవైపు ప్రేమ విషయంలోనూ పలుమార్లు బోల్తా పడింది. మోసపోయింది. ధైర్యంగా జీవితం గురించి తెలుస్తుంది. నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుంది.
47
nayanathara latest photos
ప్రేమని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే చాలా కాలం తర్వాత ఇటీవల మీడియా ముందుకొచ్చి అనేక విషయాలను పంచుకున్న నయనతార తాజాగా ఫోటోలకు పోజులిచ్చి ఆశ్చర్యపరిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె డేరింగ్ పోజులివ్వడం విశేషం. అయితే నయనతార `రివల్యూషన్`(తిరుగుబాటు) అని ప్రింట్ ఉన్న పింక్ టీషర్ట్ ధరించడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా సరైన అర్థాన్ని చాటుకునేలా ఆమె ఇలా పోజులిచ్చిందని అంటున్నారు అభిమానులు.
57
nayanathara latest photos
ప్రస్తుతం నయనతార ఈ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు పార్టీలో దిగిన ఫోటో సైతం వైరల్‌గా మారింది. కట్టిపడేస్తున్నాయి. ఇందులో కసిగా చూస్తూ చూపులతోనే కిల్ చేస్తుంది నయనతార. ఈ పిక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫోటోలను అభిమానులు, నెటిజన్లు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ లో ట్రెండింగ్‌గా మారింది నయనతార. అంతేకాదు అభిమానులు ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన హేటర్స్ కి నయనతార ఎలా చెక్ పెట్టిందో తెలియజేస్తున్నారు.
67
nayanathara latest photos
2013కి ముందు నయనతారని హేట్ చేసేవాళ్లు `ఒక లేడీ ఎప్పటికీ సూపర్ స్టార్ కాలేదు` అని కామెంట్ చేసేవారని, వాళ్లకి ఇప్పుడు నయనతార తానేంటో చూపించి గట్టి బుద్ది చెప్పిందంటున్నారు. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నయనతార `ఉమెన్స్ డే` సందర్భంగా ట్రెండింగ్ కావడం నిజమైన ఉమెన్ ఎంపవర్‌మెంట్ కి కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
77
nayanathara latest photos
ప్రస్తుతం నయనతార వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, బలమైన పాత్రలు కలిగిన చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా `సైరా` తర్వాత మరోసారి చిరంజీవితో నటిస్తుంది. అలాగే తమిళంలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన `కాతు వాకుల రెండు కాదల్` చిత్రంలో విజయ్ సేతుపతి, సమంతతో కలిసి నటిస్తుంది. అలాగే `గోల్డ్`, `కనెక్ట్` చిత్రాలతోపాటు హిందీలో షారూఖ్-అట్లీ చిత్రంలో, జీకే విక్నేష్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది నయనతార.