100 కోట్ల క్లబ్ లోకి ‘దసరా’.. నాని కేరీర్ లో ఫస్ట్ మూవీ.. డెబ్యూ డైరెక్టర్ తో నేచురల్ స్టార్ సరికొత్త రికార్డు

First Published | Apr 6, 2023, 4:18 PM IST

నేచురల్ స్టార్ నాని (Nani) కేరీర్ లోనే ఫస్ట్ టైమ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ‘దసరా’నిలిచింది. దీంతోపాటు సౌత్ ఇండస్ట్రీలోనే నాని సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం విశేషంగా మారింది. 
 

నేచురల్ స్టార్ నాని (Nani) - కీర్తి  సురేష్ జంటగా  మరోసారి నటించిన చిత్రం ‘దసరా’ Dasara. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదలైంది. అటు ఓవర్సీస్ లోనూ విడుదలై అదరగొడుతోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా దుమ్ములేపుతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. 
 

తొలిరోజే నాని దసరా మంచి ఓపెన్సింగ్స్ ను దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ.38.4 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. రెండో రోజు రూ.14 కోట్లు, మూడో రోజు 16.05 కోట్లు, నాలుగో రోజు రూ. 15.55, ఐదో రోజు రూ.6.2 కోట్లు, ఆరో రోజు రూ.5.8 కోట్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసింది.
 


నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.80 కట్ల వసూళ్లు సాధించింది. నిన్నటితో ఆరు రోజులు పూర్తి కావడంతో ‘దసరా’ కలెక్షన్లు భారీ మార్క్ ను చేరాయి.  తాజాగా మేకర్స్ అందించిన వివరాల ప్రకారం.. ‘దసరా’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. 
 

నాని కేరీర్ లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సైతం రూ.80 కోట్ల గ్రాస్ వరకే కలెక్ట్ చేసింది. మరోవైపు డెబ్యూ దర్శకుడితో నాని ‘దసరా’ రూ.100 కోట్ల వసూల్ చేయడం సౌత్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.  దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
 

దసరా బ్లాక్ బ్లాస్టర్ సక్సెస్ ఈవెంట్ ను నిన్న కరీంనగర్ టౌన్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.  తొలిసారి నాని  ఊరమాస్ లుక్ లో, తెలంగాణ యాస, భాషలో ఇరగదీయడంతో మంత్రి గంగుల కమలాకర్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. నాని ఎక్కడ పుట్టినా తెలంగాణ బిడ్డనే అంటూ అభినందంచారు.

‘దసరా’లో నాని - కీర్తి కలిసి నటించగా.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ Nani30పై ఫోకస్ పెట్టారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. నాని - మ్రుణాల్ జంటగా నటిస్తున్నారు. 

Latest Videos

click me!