అమీర్ ఖాన్ స్టైల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్.. వైరల్ అవుతున్న పిక్స్..

Published : Jul 29, 2022, 01:17 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తన కేరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ ‘బింబిసార’తో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం నందమూరి కళ్యాణ్ రామ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆయన ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ మతిపోగొడుతోంది. 

PREV
16
అమీర్ ఖాన్ స్టైల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్.. వైరల్ అవుతున్న పిక్స్..

ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’(Bimbisara)తో నందమూరి కళ్యాణ్ రామ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ కు ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. 
 

26

 తాజాగా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కోసం అదిరిపోయే మేకోవర్ తో ఆకట్టుకుంటున్నాడు. తన ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ తో మతిపోగొడుతున్నాడు. లేటెస్ట్ కళ్యాణ్ రామ్ బాడీ బిల్డింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో.. సిక్స్ ప్యాక్ కోసం ఎలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడో అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

36

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం కోసం ఎంతలా తన బాడీని ట్రాన్స్ ఫార్మ్ చేశాడో తెలిసిందే. అదే తరహాలో కళ్యాణ్ రామ్ కూడా ఫిజికల్ అపియరెన్స్ ను మార్చేశాడు. బిగ్ బెల్లీ, ఫ్యాట్ ను కరిగించి సిక్స్ ప్యాక్ తో అదుర్స్ అనిపించాడు. 
 

46

లేటెస్ట్ గా తన బాడీ బిల్డింగ్ కు సంబంధించిన బిఫోర్ మరియు ఆఫ్టర్ ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. దీనికోసం కళ్యాణ్ రామ్ ఏకంగా ఆరు నెలలు శ్రమించారు. ఫ్యాట్ ను కరిగించి.. కండలు తిరిగిన బాడీతో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. 
 

56

గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమా కోసం నందమూరి కళ్యాణ్ రామ్ బిగ్ స్క్రీన్ పై సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ ‘బింబిసార’ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ ను తీసుకొచ్చారు. దీంతో కళ్యాణ్ రామ్ పాత్ర కోసం ఎంతలా శ్రమిస్తాడో ఇట్టే అర్థమువతోంది. 
 

66

ఇక ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. మూవీలో హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా  (Catherine Tresa), సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి  ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

click me!

Recommended Stories