ఆదివారం రోజు గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకలో నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఒకే ఫ్రేములో కనిపించి అలరించారు.