2014 ఎన్నికల ముందు సూపర్ హిట్, 2019లో అట్టర్ ఫ్లాప్.. 'అఖండ' ఇప్పుడు వచ్చి ఉంటేనా..

Published : Feb 21, 2024, 06:06 PM ISTUpdated : Feb 21, 2024, 06:07 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రాలతో బాలయ్య హైట్రిక్ హిట్స్ కొట్టారు. బాలకృష్ణ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు. ఆయన ఎమ్మెల్యే.. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

PREV
17
2014 ఎన్నికల ముందు సూపర్ హిట్, 2019లో అట్టర్ ఫ్లాప్.. 'అఖండ' ఇప్పుడు వచ్చి ఉంటేనా..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రాలతో బాలయ్య హైట్రిక్ హిట్స్ కొట్టారు. బాలకృష్ణ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు. ఆయన ఎమ్మెల్యే.. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో ఎన్నికల సమయంలో బాలయ్య గురించి చర్చ రావడం సహజం. 

27

ఎన్నికల సమయంలో బాలయ్య నుంచి పవర్ ఫుల్ మూవీ రావాలని ఆయన అభిమానులంతా కోరుకుంటారు. సరిగ్గా 2014 ఎన్నికల ముందు రిలీజైన లెజెండ్ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 

 

37

ఆ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ రాజకీయాలని స్పృశిస్తూనే టిడిపి శ్రేణుల్లో, నందమూరి అభిమానుల్లో జోష్ నింపాయి. స్టేట్ అయినా, సెంటర్ అయినా నేను దిగనంతవరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య విజిల్స్ కొట్టించారు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫూల్ అని కూడా బాలయ్య అదరగొట్టారు. 

47

లెజెండ్ మూవీ 2014 ఎన్నికల ముందు విడుదలై పరోక్షంగా ఒక ప్రచారంలా మారింది. ఆ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికల ముందు బాలయ్య స్ట్రాటజీ పూర్తిగా బెడిసికొట్టింది. బాలయ్య తన సహజసిద్ధమైన శైలికి భిన్నంగా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. ఎన్నికల ముందు విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. 

57

బాలకృష్ణ ఇంకేదైనా మాస్ చిత్రం చేసి ఉంటే ఫలితం ఇంకాస్త బావుండేది. ఎన్నికల ముందు ఎన్టీఆర్ బయోపిక్ చేస్తే టిడిపి శ్రేణుల్లో జోష్ వస్తుందనే ప్రయత్నం పూర్తిగా దెబ్బ కొట్టింది. ఆ ఎన్నికల్లో టిడిపి దారుణ పరాజయం మూటగట్టుకుంది. 

67

త్వరలో 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఫ్యాన్స్ బాలయ్యని మిస్ అవుతున్నారు అనే చెప్పాలి. ఎన్నికల ముందు బాలకృష్ణ నుంచి సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కొందరు ఫ్యాన్స్ అయితే అఖండ చిత్రాన్ని ఈ టైంలో రిలీజ్ చేసి ఉండాల్సింది అని అంటున్నారు. 

77

బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. దాదాపు 80 కోట్ల షేర్ రాబట్టింది. అలాంటి చిత్రం ఎన్నికల ముందు వచ్చి ఉంటే ఆ హీటు ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

Read more Photos on
click me!

Recommended Stories