4 వరుస హిట్ చిత్రాల ఫలితం, అఖండ 2కి బాలయ్య మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. బోయపాటి కూడా తగ్గేదే లే 

Published : Jan 24, 2025, 10:00 AM IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా బాలయ్య హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు.

PREV
15
4 వరుస హిట్ చిత్రాల ఫలితం, అఖండ 2కి బాలయ్య మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. బోయపాటి కూడా తగ్గేదే లే 

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా బాలయ్య హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. అఖండ చిత్రంతో మొదలైన ప్రభంజనం రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ వరకు కొనసాగింది. 

25

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం సంచలన విజయంగా నిలిచింది. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మాహారాజ్ చిత్రాలతో బాలయ్య జోరు కొనసాగింది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 లో నటిస్తున్నారు. ఇటీవల బోయపాటి మహా కుంభమేళాలో అఖండ 2 సన్నివేశాలని చిత్రీకరించారు.

35

భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం బాలయ్య తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుస హిట్లతో బాలయ్య రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. బాలయ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేస్తున్నాయి. అఖండ 2 చిత్రానికి బాలయ్య ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. బాలయ్య ఏకంగా 40 నుంచి 45 కొట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. 

45

సీనియర్ హీరోల్లో ఇది రికార్డ్ నంబర్ అని చెప్పొచ్చు. ఐదేళ్ల క్రితం వరకు బాలయ్య రెమ్యునరేషన్ 12 కోట్లు మాత్రమే ఉండేది. అఖండ చిత్రానికి బాలయ్య 12 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత వీర సింహారెడ్డి చిత్రానికి 15 కోట్లు, భగవంత్ కేసరికి 20 కోట్లు, డాకు మహారాజ్ చిత్రానికి 27 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అఖండ 2 కి ఏకంగా 40 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారు. 

55

మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 15 నుంచి 20 కోట్లు తీసుకునే బోయపాటి అఖండ 2 చిత్రానికి 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అంటే వీళ్లిద్దరి రెమ్యునరేషన్స్ కోసమే 70 కోట్లకి పైగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అఖండ 2 చిత్ర బడ్జెట్ 175 కోట్లకి పైగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బాలయ్య కెరీర్ లోనే ఇది కాస్ట్లీ చిత్రం అని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories