సితారని ప్లాన్‌ చేయలేదు, అనుకోకుండా జరిగింది.. కూతురు గురించి నమ్రత చెప్పిన నిజం

Published : Jun 09, 2025, 03:33 PM IST

మహేష్‌ బాబు కూతురు సితారకి సంబంధించి నమ్రత ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. సితార విషయంలో తాము ప్లాన్‌ చేయలేదంటూ షాకిచ్చింది.

PREV
16
`వంశీ` సినిమా టైమ్‌లో ప్రేమలో పడ్డ మహేష్‌, నమ్రత

మహేష్‌ బాబు, నమత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రమిది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా టర్న్ తీసుకుంది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరు 2005లో పెళ్లి చేసుకున్నారు.

26
మహేష్‌, నమ్రత ప్రేమకు గుర్తు గౌతమ్‌, సితార

మహేష్‌ బాబు, నమత్రలకు ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్‌ ఘట్టమనేని, కూతురు సితార. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టడీస్‌లో బిజీగా ఉన్నారు. గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. అదే సమయంలో ఫిల్మ్ యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల గౌతమ్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

36
సెలబ్రిటీగా రాణిస్తున్న సితార

ఇక కూతురు సితార ఇప్పటికే సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె బ్రాండ్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. దుస్తుల సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరించింది. కిడ్‌ స్టార్‌గా రాణిస్తుంది సితార. అయితే తాజాగా కూతురు సితారకి సంబంధించిన షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది నమ్రత. అసలు సితార తమ ప్లానింగ్‌లో లేదట.

46
సితారని ప్లాన్‌ చేయలేదంటూ షాకిచ్చిన నమ్రత

జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకి నమ్రత స్పందిస్తూ అస్సలు నటించే అవకాశం లేదు అని తెలిపింది. తాను సినిమాలు మానేయాలనుకోవడం ముందుగా అనుకున్నదే అని తెలిపింది. అయితే సినిమాలు మానేసిన తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ తాను రిజెక్ట్ చేసినట్టు చెప్పింది నమ్రత.

56
తమ ఫ్యామిలీకే ఒక వెలుగు సితార

ఈ క్రమంలోనే షాకింగ్‌ విషయం బయటపెట్టింది నమ్రత. గౌతమ్‌ ఘట్టమనేని జన్మించిన తర్వాత తాము పిల్లలకు సంబంధించిన ప్లాన్‌ చేయలేదట. సితారని ప్లాన్‌ చేయలేదని తెలిపింది నమ్రత. ప్లాన్ చేయకుండా వచ్చిన బేబీ సితార అని, అయితే ఇప్పుడు మాకు సితారనే ప్రపంచమని తెలిపింది. తమ ఫ్యామిలీకి సితార ఒక వెలుగు లాంటిదని వెల్లడించారు నమ్రత. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

66
రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మహేష్‌

ఇక మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక నమ్రత.. మహేష్‌ ఫ్యామిలీ వ్యవహారాలను, బిజినెస్‌లను, మహేష్‌ పర్సనల్‌ విషయాలను డీల్‌ చేస్తూ బ్యాక్‌ బోన్‌గా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories