హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.
25
అమెజాన్ ప్రైమ్ కండిషన్
ఇప్పటికే మే 9, జూన్ 12 తేదీల్లో ఈ చిత్రం విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించగా, వాయిదా పడింది. అయితే రెండు సార్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందాన్ని సవరించినప్పటికీ, మూడోసారి మాత్రం సంస్థ స్పష్టమైన అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై చివరికి సినిమా విడుదల కాకపోతే ఓటిటి డీల్‌ను రద్దు లేదా ఒప్పందం చేసుకున్న అమౌంట్ లో తగ్గింపు చేసే అవకాశంఉందని హెచ్చరించారట.
35
కుబేర పరిస్థితి కూడా అంతే..
కుబేర చిత్రానికి కూడా అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాత సునీల్ నారంగ్ మీడియాకు వెల్లడించారు. "కుబేర" చిత్రం జూన్‌లో విడుదల కాకపోతే ఓటిటి సంస్థ 10 శాతం చెల్లింపును తగ్గిస్తుందనే నిబంధన విధించిందని తెలిపారు.
45
కొత్త రిలీజ్ డేట్ అదేనా ?
ప్రస్తుతం హరిహర వీరమల్లు నిర్మాత ఏ.ఎం. రత్నం కొత్త విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. సినిమా జూలై లోనే విడుదల అయ్యేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 18వ తేదీని ముఖ్యంగా పరిశీలిస్తున్నారట.
55
ఫ్యాన్స్ లో నిరాశ
ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశకు గురైంది. కానీ తాజాగా అమెజాన్ ప్రైమ్ జారీ చేసిన డెడ్‌లైన్ ప్రకారం సినిమా జూలైలో థియేటర్లలోకి రావడం ఖాయం అనే భావించాలి.