నాగార్జున‌, పవన్‌, సునీత, దిల్‌రాజు, విష్ణు విశాల్‌, ప్రభుదేవా .. సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న తారలు

First Published | Apr 26, 2021, 5:32 PM IST

ఇటీవల తమిళ నటుడు విష్ణు విశాల్‌.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలని వివాహం చేసుకున్నారు. వీరికిది రెండో పెళ్లి. ఈ సందర్భంగా సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్న పవన్‌, నాగార్జున, దిల్‌రాజు, సునీత, ప్రభుదేవా, ప్రకాష్‌ రాజులపై ఓ లుక్కేద్దాం. 
 

తమిళ నటుడు విష్ణు విశాల్‌ తన ప్రేయసి బాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాలని ఇటీవల గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికిది రెండో వివాహం కావడం విశేషం.
అంతకు ముందు రాజిని నటరాజ్‌ని వివాహం చేసుకుని విడాకులిచ్చాడు విష్ణు విశాల్‌. అలాగే బాడ్మింటన్‌ స్టాన్‌ చేతన్‌ ఆనంద్‌ ని వివాహం చేసుకుని విడాకులిచ్చింది.

సింగర్‌ సునీత కరోనా టైమ్‌లోనే డిజిటల్ రంగంలో రాణిస్తున్న రామ్‌ వీరపనేని రెండో వివాహం చేసుకుంది. అంతకు ముందే వీరిద్దరికి వివాహం జరిగి బ్రేకప్‌ తీసుకున్నారు.
టాలీవుడ్‌ బిగ్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు కరోనా సమయంలోనే వైఘా రెడ్డిని సెకండ్‌ మ్యారేజ్‌గా చేస్తున్నారు. అంతకు ముందు దిల్‌రాజు మొదటి భార్య అనిత మరణించారు.
కింగ్‌ నాగార్జున 1992లో హీరోయిన్‌ అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతకు ముందు హీరో వెంకటేష్‌ సోదరి లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు.
లక్ష్మి కెరీర్‌ వేరు, నాగ్‌ కెరీర్‌ వేరు. ఇద్దరికి మ్యాచ్‌ కాలేదు. విడిపోయారు.
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందిని వివాహం చేసుకున్నాడు. పదేళ్ల తర్వాత విడిపోయాడు. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్‌ని సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. 2012లో విడాకులిచ్చాడు. ఆ తర్వాత రష్యాకి చెందిన అన్నా లెజనేవాని మూడో వివాహం చేసుకున్నాడు.
సీనియర్‌ నటులు శరత్‌ బాబు, నటి రమాప్రభ మొదట పెళ్లి చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత స్నేహలతా దీక్షిత్‌ని శరత్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు.
కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మొదట రామలతాని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది సీక్రెట్‌గా వైద్యురాలు హిమనిని వివాహం చేసుకున్నట్టు టాక్‌.
ఇదిలా ఉంటే స్టార్‌ హీరోయిన్‌ నయనతారతో డేటింగ్‌ చేసిన ప్రభుదేవా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమెకి బ్రేకప్‌ చెప్పాడు.
యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సైతం మొదట వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. పదేళ్లకు విడిపోయారు. ఆ తర్వాత సారికని 1988లో వివాహం చేసుకున్నారు. 2004లో విడిపోయారు. వీరికి శృతి హాసన్‌, అక్షర హాసన్‌ జన్మించారు.
ఆ తర్వాత నటి గౌతమితో సహజీవనం చేశారు. 2016లో వీరిద్దరు విడిపోయారు.
నటుడు శరత్‌ కుమార్‌ 1984లో ఛాయాని వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2000లో విడిపోయారు. ఆ నెక్ట్స్ ఇయార్‌ నటి రాధికని వివాహం చేసుకున్నారు. ఆమెకిది మూడు వివాహం. అంతకు ముందు దర్శకుడు ప్రతాప్‌ పోతన్‌ని, ఆ తర్వాత రిచర్డ్ ని వివాహం చేసుకుంది.
విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మొదట 1994లో లలిలా కుమారిని వివాహం చేసుకున్నారు. ఆమెకి 2009లో విడాకులిచ్చి ఆ నెక్ట్స్ ఇయర్ పోనీ వర్మని సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు ప్రకాష్‌ రాజ్‌.

Latest Videos

click me!