చావు ఇళ్లకు నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు.. ఆ నమ్మకం, భయాలు ఉన్నాయా ?

Published : Dec 26, 2022, 09:35 AM IST

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు సినీ ప్రముఖుల్ని కలవర పెడుతున్నాయి. కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నిన్న సీనియర్ నటుడు చలపతిరావు తక్కువ వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

PREV
16
చావు ఇళ్లకు నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు.. ఆ నమ్మకం, భయాలు ఉన్నాయా ?

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు సినీ ప్రముఖుల్ని కలవర పెడుతున్నాయి. కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నిన్న సీనియర్ నటుడు చలపతిరావు తక్కువ వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వయసు ప్రభావం వల్లే వీరంతా మరణించారు. కానీ టాలీవుడ్ లో తరుచుగా విషాద వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 

26

వీరంతా మరణించినప్పుడు సినీ ప్రముఖులంతా వెళ్లి పార్థివ దేహాలకు నివాళులు అర్పించడం చూశాం. కానీ కింగ్ నాగార్జున మాత్రం ఇటీవల ఏ సెలెబ్రటీ మరణించినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన సందర్భాలు లేవు. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, పవన్, అల్లు అరవింద్ , సురేష్ బాబు ఇలా టాలీవుడ్ బడా సెలెబ్రిటీలు అంతా వెళుతున్నారు. 

36

పోస్ట్ పోన్ చేయలేని షెడ్యూల్ ఉంటే మాత్రం ఒకరిద్దరు మిస్ అవుతున్నారు. చలపతిరావు మరణించినప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఫారెన్ టూర్ లో ఉన్నారు. కానీ చలపతిరావు మరణవార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశారు. చలపతిరావు ని కడసారి చూశారు. 

46

కానీ నాగార్జున నుంచి ఇలాంటివి ఏవి ఉండడం లేదు. ఒకటి రెండు సార్లు అయితే బిజీగా ఉన్నారని అనుకోవచ్చు. ఇటీవల కాలంలో నాగార్జున ఏ చావు ఇంటికి వెళ్లడం లేదు. ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం విషాదాలు జరిగిన ఇంటికి వెళుతున్నారు. అయితే నాగార్జున ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దానిపై కొత్త చర్చ మొదలైంది. 

 

56

కొందరికి చావు ఇళ్లకు వెళ్ళకూడదు అనే నియమం ఉంటుంది. అలాగే ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కూడా జ్యోతిష్యులు, స్వామీజీలు చెడు జరిగిన ఇళ్లకు వెళ్ళకూడదు అని సూచిస్తారు. దీనితో నాగార్జున జ్యోతిష్యుల సలహా ఏమైనా పాటిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

 

66

ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. బాలయ్యకి జ్యోతిష్యాలు, పూజలు, రాసులపై నమ్మకం ఎక్కువ అని అంటుంటారు. కానీ బాలయ్య మాత్రం విషాదాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి నాగార్జున విషయంలో ఏం జరుగుతోందో స్వయంగా కింగే క్లారిటీ ఇవ్వాలి. 

click me!

Recommended Stories