నాగ చైతన్యకు పెళ్లి చేయబోతున్న నాగార్జున, అమ్మాయి ఎవరంటే..?

First Published | Feb 11, 2024, 7:02 PM IST

నాగచైతన్యకు రెండో పెళ్ళి చేయబోతున్నాడు కింగ్ నాగార్జున. ఇప్పటికే అమ్మాయినికూడా ఫిక్స్ చేశాడట. పెళ్లి కోసం ముహూర్తాలు పెట్టుకోవడమేతరువాయి అంటున్నారు.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే..? 
 

నాగచైతన్య  సమంతతో విడాకుల తరువాత ఇద్దరు కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. అప్పడప్పుడు వీరి రెండో పెళ్ళి గురించి వార్తలు వైరల్ అవుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కనీసా ఆ విషయంలో  కూడా స్పందించడంలేదు. అయినా సరే ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఏం మాయ చేశావే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్దారు.. సీక్రేట్ గా ప్రేమించుకున్నాడు.. 2017 లో పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి  కూడా చేసుకున్నారు. మూడు ముళ్ళ బంధానికి మూడే మూడేళ్లు కాపురం చేసిన ఈజంట.. మనస్సర్ధలతో వారి బంధాన్ని ముగించేశారు.  టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీపుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట..  లోపల గొడవలు కనిపించకుండా దాచారు. వీడాకులతో ఫ్యాన్స్ పెద్ద షాక్ ఇచ్చారు. 


ఇక వీరి విడాకులు తరువాత కెరీర్  లో విడివిడిగా బిజీ అయిపోయారు. ఇక ఈక్రమంలో నాగచైతన్యకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్యకు త్వరలో పెళ్లి చేయాలని చూస్తున్నాడట నాగార్జున. ఇప్పటికే చైతూకు జోడీ అయిన మంచి అమ్మాయిని కూడా సెలక్ట్ చేశాడట నాగ్. 
 

ఆ అమ్మాయి ఎవరో కాదు.. నాగార్జున బంధువుల అమ్మాయేనట. బంధువులలో మంచి అమ్మాయిని సెలక్ట్ చేశారట నాగ్. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అటు చైతూ కూడా మీ ఇష్టం అని. నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టు తెలుస్తోంది. దాంతో అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతున్నట్టు తెలుస్తోంది. 
 

ఇక నాగచైతన్య సమంతతో విడాకుల తరువాత ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు గట్టిగా వినిపించాయి. బాలీవుడ్ లో సెటిల్ అయిన తెలుగమ్మాయి శోభిత దూళిపాల తో  చైతూ ప్రేమలో ఉన్నట్టు టాక్ గట్టిగా నడిచింది. అంతే కాదు.. ఫారెన్ లో వీరు డిన్నర్ డేట్ చేస్తూ కనిపించారు.. ఆ ఫోటో కూడా వైరల్ అయ్యింది. కాని ప్రస్తుతం ఈ వార్తలు ఆగిపోయాయి. ఈ జంట కూడా ఎక్కడా కనిపించడం లేదు.
 

ఇక సమంత పెళ్లిపై కూడా రకరాల వార్తలు వచ్చాయి. సమంత రెండో పెళ్లి త్వరలో జరగబోతున్నట్టు ఇప్పటికీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే సమంత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోసైటిస్ తో బాధపడుతూ.. టీట్మెంట్ తీసుకుంటుంది. ఫారెట్ ట్రిప్పులతో తన బాధను మర్చిపోయే ప్రయత్నం చస్తోంది. 

Latest Videos

click me!