బంగార్రాజు మూవీ సంక్రాంతి పర్ఫెక్ట్ బొమ్మ అంటూ అంచనాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో నాగ చైతన్య పల్లెటూరి యువకుడిగా, రొమాంటిక్ బాయ్ గా కనిపిస్తున్నాడు. భోగి పండగ రోజుకు బంగార్రాజు బరిలోకి దిగబోతున్నాడు. దీనితో నాగ చైతన్య మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు.