ప్రస్తుతం నాగచైతన్య, సమంత విషయం మరోసారి వైరల్ అవుతోంది. రీసెంట్ గా సమంత తన డివోర్స్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ట్రెండింట్ అవుతున్న వేళ, నాగచైతన్య రీసెంట్ గా చేసిన కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి. మరి చైతూ ఏమన్నాడు.
సౌత్ సూపర్ కపుల్స్ లో మొన్నటి వరకూ నాగచైతన్య, సమంతా రూత్ ప్రభు కూడా ఉన్నారు. లాస్ ఇయర్ అక్టోబర్ లో వీరిద్దరు విడాకులతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటి వరకూ వారిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. గత ఏడాది సోషల్ మీడియాలో డివోర్స్ అనౌన్స్ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ జంట ఈ విషయంలోస్పందించలేదు. ఎవరు ఎన్ని అనకున్నా... ఓపెన్ అవ్వలేదు.
28
Image: Naga Chaitanya/Instagram
ఈ జంటను అభిమానించే వారి హృదయాలను బద్దలు కొట్టారు. ఇక ఎవరికి వారు వారి కెరీర్ల మీద దృష్టి పెట్టారు. ఇక వీరు విడాకులు ప్రకటించిన పది నెలల తరువాత మరోసారి ఈ ఇద్దరి ఇష్యూ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. అటు చైతన్య కూడా తన గురించి ఓపెన్ అయ్యారు.
38
నాగ చైతన్య థాంక్యూ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నిన్ననే థియేటర్లలోకి వచ్చింది సినిమా. ఇక థాంక్యూ ప్రమోషన్స్ లో మాట్లాడిన నాచైతన్యా తన లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ సమంతకు సంబంధించి విడాకుల విషయంపై మాట్లాడారు. మీడియా నాగచైతన్యను వ్యాక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా.. డిఫరెంట్ గా స్పందించారు.
48
Image: Official film poster
నాగ చైతన్య మాట్లాడుతూ.. ఇప్పుడే నేను కాస్త మనిషిలా మారాను. ఇంతకు ముందు మనసు విప్పి మాట్లాడలేకపోయాను. నన్ను నేను చాలా కోల్పోయాను.. నాతో పాటు చాలా మందిని కోల్పోయిన బాధ ఉంది. కాని ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, ఏ పని అయినా సరే చేయగలుగుతున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో అనుబంధం ఇంకా పెరిగి పోయింది. నన్ను నేను ఇలా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పూర్తిగా కొత్త వ్యక్తిని అన్నారు.
58
అయితే ఈ కామెంట్స్ తో నాగచైతన్య చాలా సఫర్ అయినట్టు అర్ధం అవుతుంది. మ్యారేజ్ తరువాత తాను ఆర్టిఫిషియల్ లైఫ్ లో ఉన్నట్టు చైతూ ఫీల్ అయ్యారు... విడాకులు తరువాత తన ఫ్రీ అయినట్టు ఫీల్ అవుతున్నారా..? అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
68
రీసెంట్ గా సమంత కూడా ఈ విషయంలో ఘాటు గా స్పందించింది. మేము సామరస్యంగా విడిపోలేదని, ఇప్పుడు కూడా తమను ఒక గదిలో పెడితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలని కరణ్ జోహార్ షోలో తేల్చేసింది. తనుచాలా ఆవేదన అనుభవించానంది. తనకు 250 కోట్లు భరణంవచ్చిందన్న వార్తల్లో నిజం లేదు అన్నది సమంత. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
78
గత ఏడాది అక్టోబర్‌లో, నాగ చైతన్య మరియు సమంత ఒక తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. తమకు అభిమానుల నుండి సపోర్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేశారు. తాము స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు చైసామ్. అభిమానులు మాత్రం వీరు మళ్ళీ కలిస్తే బాగుండు అని ఆశపడుతున్నారు.
88
ఇక నాగచైతన్య థాంక్యూ మూవీ తో ఆడియన్స్ ముందు వచ్చాడు. మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఆయన లాల్ సింగ్ చద్దా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక సమంత కూడా టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్,హాలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.