నాని హీరోయిన్ ను చూశారా..? గుర్తుపట్టనంతగా మారిపోయిన బ్యూటీ..

Published : Dec 27, 2023, 07:14 PM IST

మనం గమనించడం లేదు కాని.. చాలా మంది తారలు  వెండితెరపై కనిపించకుండా పోయారు. చాలా రోజులకు ఎవరికో ఒకరికి గుర్తు రావడం.. ఎక్కడున్నారని సెర్చ్ చేయడం.. ఇలా అయిపోయారేంటి అని ఆశ్చర్యపోవడం ఈమధ్య ఎక్కువైపోయింది. కనుమరుగైన తారలను అప్పుడప్పుడు అలా పలుకురిస్తుంటే..వారు ఎలా ఉన్నారు అనేది ఆడియన్స్ కు తెలుస్తుంది.తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోయిన్ లుక్ ఇలానై వైరల్ అవుతోంది.   

PREV
17
నాని హీరోయిన్ ను చూశారా..? గుర్తుపట్టనంతగా మారిపోయిన బ్యూటీ..
Actress Saranya Mohan Family Photos

మనం గమనించడం లేదు కాని.. చాలా మంది తారలు  వెండితెరపై కనిపించకుండా పోయారు. చాలా రోజులకు ఎవరికో ఒకరికి గుర్తు రావడం.. ఎక్కడున్నారని సెర్చ్ చేయడం.. ఇలా అయిపోయారేంటి అని ఆశ్చర్యపోవడం ఈమధ్య ఎక్కువైపోయింది. కనుమరుగైన తారలను అప్పుడప్పుడు అలా పలుకురిస్తుంటే..వారు ఎలా ఉన్నారు అనేది ఆడియన్స్ కు తెలుస్తుంది.తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోయిన్ లుక్ ఇలానై వైరల్ అవుతోంది. 
 

27
Saranya Mohan

హీరోయిన్ శరణ్య మోహన్ మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. ఎంతో  చక్కగా ముద్దుగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం  గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కేరళలోని అలెప్పీలో పుట్టి, పెరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినశరణ్య. 

37

ఎనిమిదేళ్లకే మలయాళంలో మూడుసినిమాలు చేసింది. తమిళంలో రెండు సినిమాలు బాల నటిగా చేసి అలరించింది. ఇక ఆతరువాత హీరోయిన్ గా మారింది. కాని ఆమెకు హీరోయిన్ గా కెరీర్ సహకరించలేదు. దాంతో యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపుతెచ్చుకుంది. 

47

నేచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు మూవీలో హీరోయిన్ నటించి మెప్పించింది బ్యూటీ.  అటు  కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమాలో కూడా హీరోయిన్ గా శరణ్య మోహన్ నటించారు. విలేజ్ లో వినాయకుడు  సినిమాతోనే  టాలీవుడ్ కు శరణ్య పరిచయం అయ్యారు. . ఆ సినిమాతో శరణ్యకు నటిగా మంచి మార్కులు పడ్డాయి.  ఆ తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఆ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచేసింది. 

57

ఇక ఆతరువాత ఈ ముద్దు గుమ్మకు హీరోయిన్ గా ఛాన్స్ లు ఎక్కువగా రాలేదు.  దాంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అవ్వాల్సి వచ్చింది.  నందమూరి కల్యాణ్ నటించిన కల్యాణ్ రామ్ కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లెలిగా నటించింది శరణ్య. ఆతరువాత హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 

67
Saranya Mohan

ఇక ఆతరువాత శరణ్య మోహన్ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తెలుగు తెరపై అస్సలు కనిపించలేదు. 2015 లో తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ పెళ్లాడి ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది. అప్పట్లో ఎంత క్యూట్ గా ఉండేదో శరణ్య మోహన్.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఆమె అభిమానులు సినిమాలుచేయాలని అడుగుతున్నారట. కాని  శరణ్య సినిమాలు చేసే ఆలోచనలో లేదంట. 

77
Actress Saranya Mohan Family Photos

అయితే శరణ్య కళను మాత్రం వదల్లేదు. తాను  స్వతహాగా భరత నాట్యకారణి కావడంతో..తన డాన్స్ ను కంటీన్యూ చేస్తూ.. వాటికి సబంధించని వీడియోలను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ డేట్  చేస్తుంటుంది. హీరోయిన్ గా ఉన్నప్పుటితో పోలీస్తే.. ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ప్రేక్షకులు శరణ్యను గుర్తు పట్టలేకపోయారు అసలు ఎవరు కూడా ఆమె భీమిలీ కబడ్డి సినిమాలో నటించిన హీరోయిన్ అంటే కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories