'పుష్ప 2' వివాదం: లీగల్ యాక్షన్ తీసుకుంటామని నిర్మాతల వార్నింగ్

First Published | Dec 7, 2024, 4:26 PM IST

పుష్ప 2 చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. సినిమాలోని డైలాగ్‌లను వక్రీకరించి వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అల్లు అర్జున్ అభిమానుల సంఘం కూడా అధికారికంగా స్పందించి, నటుడి పేరుతో ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే వారి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి తమ మద్దతు లేదని స్పష్టం చేసింది.

Pushpa 2, Sukumar, allu arjun

పుష్ప2 చిత్రంపై కొంత మంది నెగిటివ్ ప్రాపగాండ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు రోజు  ప్రీమియర్ షోలు పడ్డాయో లేదో అందులో సీన్స్, డైలాగ్స్ ఇలా అన్నిటి గురించి ప్రత్యేక చర్చ మొదలైంది.  

ముఖ్యంగా ఎవర్రా బాస్ అంటూ చెప్పే ఒక డైలాగ్ ని కొద్దిగా మార్చి సోషల్ మీడియాలో సినిమాపై నెగిటివ్ క్యాంపైన్ మొదలెట్టారు కొందరు. సినిమా చూసిన వాళ్లు దాన్ని ఫేక్ అని అర్దం చేసుకున్నా, మిగతా వాళ్లు నిజమనుకుంటున్నారు. దాన్ని వైరల్ చేస్తున్నారు.  

Pushpa 2, Sukumar, allu arjun

కథలో భాగంగా సినిమా ప్రారంభంలో హీరో ఇండ్రడక్షన్ సీన్ లో ఈ డైలాగు వస్తుంది. పుష్ప రాజ్ ఎర్రచందనం డీల్ కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్తాడు. అతనితో మాట్లాడే టైం లో పుష్ప రాజ్ బాస్ డైలాగ్ వస్తుంది. అసలు సినిమాలో డైలాగ్ ఏంటంటే ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్.. మామూలుగా చూస్తే నీకు బాస్ కనిపిస్తాడు.

ఇలా తన కిందకు చూస్తేనే నీ బాస్ లకి బాస్ అనేస్తాడు.. నేనే రా నీ బాస్ అని చెబుతాడు. కానీ ఈ డైలాగ్ ని సోషల్ మీడియాలో వేరేలా చెబుతున్నారు. ఆ డైలాగ్ ని మార్చి ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే రా బాస్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.


  దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ఆ  ఫేక్ ప్రాపగాండ ఎఫెక్ట్ పడుతోంది. ఈ క్రమంలో మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఆ డైలాగ్స్ మీద రియాక్ట్ అయింది.  ఫేక్ పోస్టులు మానకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది! ''ఊహాజనితమైన, సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు 'పుష్ప 2' సినిమాలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

వాంటెడ్ (కావాలని)గా కొంత మంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం'' అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.  
 

pushpa 2

మరో ప్రక్క ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వార్నింగ్ ట్వీట్  ఇచ్చారు ఇదే విషయమై.... ‘‘అల్లు అర్జున్ గారి తరుపున ఎవరైనా ఫ్యాన్స్ అని చెప్పుకొని టివి మరియు యుట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చినా, అది వారి వ్యక్తిగతం అంతే గాని వారి భావజాలానికి అధికారిక మద్దతు లేదా సపోర్ట్ ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయంగా ఏ నాయకుల మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి చేసే కామెంట్స్ మేము సపోర్ట్ చేయం అలాంటి అభిమానులను దూరంగా ఉంచటం జరుగుతుంది’’ అని ప్రకటించారు.

ఇక ఈ వివాదం ప్రక్కన పెడితే పుష్ప 2 సినిమాకు అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే  జాతర సీన్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో కూడా అల్లు అర్జున్ నటన యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించేస్తున్నాయి.  సుకుమార్, అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పాలి. పుష్ప 2  చివర్లో  పుష్ప 3 అని కూడా చెప్పి ఆడియన్స్ ని ఆనందపరిచారు సుకుమార్.
 

Latest Videos

click me!