Netflix Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 5 సిరీస్‌లు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే వెబ్ మూవీస్ ఇవే

Published : Jun 30, 2026, 03:42 PM IST

Must Watch Netflix Series: ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 5 వెబ్ సిరీస్‌లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. లవ్, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్.. ఇలా ఒక్కో సిరీస్ ఒక్కో రకమైన అనుభూతిని ఇస్తోంది. అవేంటో వివరంగా చూద్దాం.

PREV
15
ట్రెండింగ్ వెబ్ సిరీస్‌లు

వీకెండ్‌లో ఏం చూడాలా అని చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, యాక్షన్ లాంటి వెరైటీ కథలను ఇష్టపడే వాళ్లంతా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వైపు చూస్తున్నారు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఐదు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సిరీస్ భిన్నమైన కథ, వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

25
బ్రిడ్జర్టన్ సీజన్ 4
ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది 'బ్రిడ్జర్టన్ సీజన్ 4' గురించి. ఒక మాస్క్ పార్టీలో కలిసిన మిస్టీరియస్ అమ్మాయి కోసం బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ వెతకడమే ఈ సిరీస్ కథ. సామాజిక హోదా, వర్గ బేధాలను దాటి సాగే ఈ ప్రేమకథపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక సౌత్ కొరియా విద్యావ్యవస్థలోని అధికార దుర్వినియోగం, విద్యార్థుల వేధింపుల నేపథ్యంలోని 'టీచ్ యూ ఎ లెసన్' సిరీస్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
35
హిస్ అండ్ హెర్స్
థ్రిల్లర్ ప్రియులకు 'హిస్ అండ్ హెర్స్' సిరీస్ కొత్త అనుభూతిని ఇస్తుంది. తన సొంత ఊరిలో జరిగిన హత్య కేసును ఓ మాజీ న్యూస్ యాంకర్ విచారిస్తుంటుంది. అయితే, ఆ కేసుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన మాజీ భర్తే అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత బయటపడే రహస్యాలు కథను సైకలాజికల్ థ్రిల్లర్‌గా మారుస్తాయి. అలాగే 'వన్ పీస్ సీజన్ 2'లో లఫీ, అతని టీమ్ చేసే కొత్త సాహసాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
45
ది వండర్ఫుల్ ఫూల్స్
మరో సిరీస్ 'ది వండర్‌ఫుల్ ఫూల్స్'. 1990ల చివర్లో ప్రపంచం అంతమైపోతుందనే భయాలు వ్యాపించిన కాలాన్ని ఇది నేపథ్యంగా తీసుకుంది. సమాజం వెలివేసిన కొందరికి అనుకోకుండా అద్భుత శక్తులు వస్తాయి. ఆ తర్వాత వారి జీవితాల్లో వచ్చే మార్పులే ఈ కథ. ఫాంటసీ, సస్పెన్స్ కలగలిసిన ఈ సిరీస్ చాలామందిని ఆకట్టుకుంటోంది.
55
చూడాల్సిన వెబ్ సిరీస్
మొత్తం మీద ఈ వారం నెట్‌ఫ్లిక్స్.. లవ్, మిస్టరీ, క్రైమ్, యాక్షన్, ఫాంటసీ.. ఇలా అన్ని జానర్ల ప్రేక్షకులకు నచ్చే కంటెంట్‌ను అందిస్తోంది. బోర్ కొట్టకుండా ఎక్కువసేపు చూసే వెబ్ సిరీస్‌ల కోసం వెతికేవారికి ఈ ఐదు సిరీస్‌లు బెస్ట్ ఛాయిస్ అవుతాయి.
Read more Photos on
click me!

Recommended Stories