భార్యకి విడాకులిచ్చి హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మ్యూజిక్ డైరెక్టర్ ? ఆమెని ఎలా తిడుతున్నారో తెలుసా

Published : Feb 20, 2025, 02:15 PM IST

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు సహజం. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కువగా రూమర్స్ వినిపిస్తుంటాయి. కానీ పెళ్ళైన హీరో గురించి రూమర్స్ వస్తే మాత్రం సంచలనం అవుతుంటాయి. ఇలాంటి వ్యవహారాలు కూడా గతంలో జరిగాయి.

PREV
15
భార్యకి విడాకులిచ్చి హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మ్యూజిక్ డైరెక్టర్ ? ఆమెని ఎలా తిడుతున్నారో తెలుసా
GV Prakash Kumar, Divyabharathi

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు సహజం. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కువగా రూమర్స్ వినిపిస్తుంటాయి. కానీ పెళ్ళైన హీరో గురించి రూమర్స్ వస్తే మాత్రం సంచలనం అవుతుంటాయి. ఇలాంటి వ్యవహారాలు కూడా గతంలో జరిగాయి. అయితే తాజాగా మల్టీ ట్యాలెండ్ హీరో, ఓ యంగ్ బ్యూటీ ఈ రకమైన వార్తల్లో నిలిచారు. 

25
Dhivyabharathi

ఆ హీరో పేరు జివి ప్రకాష్ కుమార్. జివి ప్రకాష్ గురించి పరిచయం అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా జివి ప్రకాష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా రాణిస్తున్నాడు. జివి ప్రకాష్ 2024లో తన భార్య సైంధవి నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. 

35
Music Director GV Prakash

అయితే జివి ప్రకాష్, సైంధవి విడాకులకు కారణం యంగ్ హీరోయిన్ దివ్య భారతి అంటూ ప్రచారం జరిగింది. జివి ప్రకాష్, దివ్యభారతి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని అందుకే ఈ హీరో తన భార్యకి దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. తాజాగా దివ్యభారతి, జివి ప్రకాష్ నటించిన కింగ్స్టన్ చిత్రం మార్చి 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

45
gv prakash kumar

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జివి ప్రకాష్, దివ్య భారతి ఇద్దరూ తమపై వస్తున్న రూమర్స్ గురించి ఓపెన్ అయ్యారు. దివ్య భారతి మాట్లాడుతూ.. జివి ప్రకాష్ తన భార్యతో విడిపోవడానికి కారణం నేనే అని చాలా మంది నన్ను నిందించారు. నన్ను దారుణంగా తిడుతూ మెసేజ్ లు పెట్టారు అని దివ్య భారతి తెలిపింది. నేను, జివి గతంలో బ్యాచిలర్ చిత్రంలో కలసి నటించాము. ఈ మూవీలో నాకు, జివికి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

55
Divyabharathi

దానివల్ల మేము రిలీజ్ లైఫ్ లో కూడా అలాగే ఉన్నామని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను తిడుతూ ఎక్కువగా మహిళలే మెసేజ్ లు పెట్టేవారు అని దివ్యభారతి తెలిపింది. జివి మాట్లాడుతూ నాకు, దివ్య భారతికి మధ్య మంచి స్నేహం ఉంది తప్ప ఇంకేమి లేదు. మేమిద్దరం పలు ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశాం. నేను ఉన్నది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి.. మిగిలిన విషయాలు పట్టించుకోను అని జివి తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories