బాత్ రోబ్ లో మెస్మరైజ్ చేసేలా మృణాల్ ఠాకూర్ ఫోజులు.. మరాఠి భామ క్యూట్ ఫొటోస్

First Published | Oct 21, 2023, 5:41 PM IST

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తన పోస్టులతో ఆకట్టుకుంటోంది.
 

‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. సీతగా ఈ బ్యూటీ ఇచ్చిన పెర్ఫామెన్స్ ను ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆమె అందం, అభినయానికి తెలుగులోనూ వరుసగా ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. 
 

ఇప్పటికే హిందీలో దుమ్ములులేపుతున్న మృణాల్ ఠాకూర్ ఇటు టాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ‘సీతారామం’ తర్వాత రెండు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తోంది. అటు హిందీలోనూ మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
 


ఇలా సినిమాలతో ఎప్పటికప్పుడు తన అభిమానులకూ అప్డేట్స్ చేరవేస్తూనే ఉంది. అలాగే తన పర్సనల్ విషయాలనూ పంచుకుంటూ మరింతగా దగ్గరవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫొటో డంప్ తో అట్రాక్ట్ చేసింది. కొన్ని క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంది.
 

మృణాల్ పంచుకున్న ఫొటోస్ ల్లో ఏకంగా బాత్ రోబ్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. మార్నింగ్ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతోంది. అలాగే మిర్రర్ ముందు ముస్తాబవుత ఫొటోలకు ఫోజులిచ్చింది. తన ఔటింగ్ సంబంధించిన క్యూట్ పిక్స్ ను కూడా పంచుకొని అట్రాక్ట్ చేసింది.

తెలుగులో మృణాల్ ఠాకూర్ కు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. ‘సీతారామం’ తర్వాత ఇక్కడ మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

అలాగే, డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గీతాగోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక నెక్ట్స్ రామ్ చరణ్ మూవీలోనూ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలా మృణాల్ తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!