మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నెట్టింట అందాలతో దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో అడుగుపెడితే చాలా గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది. కాకరేపు అందాలతో మంటలు రేపుతోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పిప్పా’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
టాప్ గ్లామర్ షోతో మత్తెక్కించింది. ఈ అవుట్ ఫిట్ లో సాధ్యమైనంత స్కిన్ షోతో చేసి రచ్చరచ్చ చేసింది. మత్తెక్కించే ఫోజులతో మృణాల్ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.
అందాల ప్రదర్శన ఓవైపు అయితే.. మునుపంటితో పెదాలను కొరుకుతూ మరింతగా టెంప్ట్ చేస్తోంది. కిక్కిచ్చే ఫోజులతో క్రేజీ హీరోయిన్ రచ్చ మాములుగా లేదు. ఈ సందర్భంగా మృణాల్ ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఇలా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ పరంగానూ అదరగొడుతోంది.
ప్రస్తుతం తెలుగు మృణాల్ రెండు సినిమాల్లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’, మరోవైపు డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాన్నున్నాయి.