BiggBoss7:ఓట్ల కోసం ఇలాంటి పనులా, తెరవెనుక జరిగే నాటకం ఇదే.. శివాజీ, అమర్, ప్రశాంత్ మామూలోళ్లు కాదుగా

First Published | Dec 14, 2023, 8:38 PM IST

ఎలాగైనా బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ గెలిచేందుకు కంటెస్టెంట్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లోపల వాళ్ళ కష్టం, గేమ్ ఆడే విధానం ఒకెత్తయితే.. బయట ఒక రేంజ్ లో మనీ గేమ్ సాగుతోంది అని సమాచారం. 

Bigg Boss Telugu 7

కింగ్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు టైటిల్ రేసులో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్, అర్జున్ ఫైనల్ వీక్ లో సందడి చేస్తున్నారు. 

Bigg Boss Telugu 7

వీరిలో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ లకు ప్రేక్షకుల్లో బలమైన మద్దతు లభిస్తోంది. టైటిల్ పోటీ వీరి ముగ్గురిలోనే ఉండబోతోందని ఆడియన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. మరోవైపు యావర్, ప్రియాంక కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన అర్జున్ ఇస్తున్న పోటీ నామమాత్రమే అని చెప్పాలి. 


Bigg Boss Telugu 7

అయితే అంతిమంగా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని ఓట్లు సాధించిన కంటెస్టెంట్ మాత్రమే విజేతగా నిలుస్తాడు. విజేతకు 50 లక్షల నగదుతో పాటు మారుతి సుజుకి కారు, 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభిస్తాయని నాగార్జున ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు విజేతకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడుతుతుంది. ఇక ఎవరి పారితోషికం వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాగు ఉంటుంది. 

దీనితో ఎలాగైనా బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ గెలిచేందుకు కంటెస్టెంట్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లోపల వాళ్ళ కష్టం, గేమ్ ఆడే విధానం ఒకెత్తయితే.. బయట ఒక రేంజ్ లో మనీ గేమ్ సాగుతోంది అని సమాచారం. బిగ్ బాస్ ఓటింగ్ ఇలా కూడా సాగుతుందా అని సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా డబ్బు ప్రభావం కనిపిస్తుందట. 

బయట జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో వారి రేంజ్ కి తగ్గట్లుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్ట్రాటజీ టీమ్స్ ఉన్నాయట. ప్రస్తుతం ఫైనల్ వీక్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ స్ట్రాటజీ టీమ్స్ పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. సదరు స్ట్రాటజీ టీమ్స్ కళాశాల విద్యార్థులని మీట్ అవ్వడం, ఇతర పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించి ఓట్లు పడేలా చేస్తారు. 

శివాజీ, అమర్ దీప్ లాంటి బాగా సౌండ్ గా ఉన్న కంటెస్టెంట్స్ వారానికి లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట. ఎలాగైనా ఓట్లు పడేలా చేయడమే స్ట్రాటజీ టీమ్స్ చేయాల్సిన పని. ఇక పల్లవి ప్రశాంత్ తన రేంజ్ లో తాను క్యాంపైన్ చేసుకుంటున్నాడట. అయితే ప్రశాంత్ కి రైతు బిడ్డ అనే సెంటిమెంట్ ఉండడంతో జెన్యూన్ ఓటింగ్ కూడా ఉంది. దీనితో ప్రశాంత్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లు సమాచారం. 

శివాజీ, అమర్ లు ఇంకాస్త ఎక్కువగా డబ్బు వెదజల్లితే ఓటింగ్ తారుమారయ్యే ఛాన్స్ ఉంది. తాము ఫైనల్ చేరుతామనే అంచనాలు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఈ పైడ్ క్యాంపెయినింగ్ ని 8 వ వారం తర్వాత మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పైడ్ క్యాంపెయినింగ్ పీక్స్ కి చేరింది. బిగ్ బాస్ ఓటింగ్ వెనుక ఈ రేంజ్ లో తతంగం సాగుతోంది అన్నమాట. 

Latest Videos

click me!