బిగ్ బాస్ చెప్పగానే లిప్ స్టిక్, కొత్త డ్రెస్ వేసుకొని డేట్ కి రెడీ అయిన మోనాల్...అఖిల్ తో స్మశానానికి వెళ్ళి

First Published Nov 26, 2020, 12:06 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 12వరాలు దాటిపోతుంది. మరో నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. గత వారం లాస్య ఎలిమినేటై వెళ్లిపోగా, ఈ వారానికి గాను అఖిల్, మోనాల్, అరియనా మరియు అవినాష్ ఎలిమినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ టాస్క్ లో గెలిచిన అవినాష్ ఎలిమినేషన్ ఇమ్యూనిటీ కార్డు పొందడం వలన, వచ్చే వారం అవినాష్ ఎలిమినేటయ్యే అవకాశం లేదు.

అఖిల్, మోనాల్ లేదా అరియనా హౌస్ నుండి వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. కాగా నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ ని దెయ్యాల కొంపగామార్చేశాడు. హౌస్ లో విచిత్రమైన శబ్దాలు మొదలవగా, అరియనాకు దెయ్యాలు కూడా కనిపించాయి. ఒక లేడీ దెయ్యం వాయిస్ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.
undefined
బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ఏరియాను స్మశానంలా మార్చేశారు. కాగా ఇంటి సభ్యులలో అఖిల్, అభిజిత్ లకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మొదటి నుండి అఖిల్, అభిజిత్ వలన మోనాల్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు అన్నాడు. మోనాల్ ని ఇబ్బంది పెట్టిన అఖిల్, అభిజిత్ గార్డెన్ ఏరియాలో ఉన్న స్మశానానికిఆమెనుడేట్ కి తీసుకెళ్లాలని బిగ్ బాస్ కోరాడు.
undefined

Latest Videos


దీని కోసం కెప్టెన్ హారిక నిర్వహించే క్విజ్ లో అఖిల్, అభిజిత్ పాల్గొనాలని, గెలిచిన వారు మోనాల్ ని డేట్ కి తీసుకెళ్లే అవకాశం పొందుతారని చెప్పాడు. మోనాల్ ని డేట్ కి తీసుకెళ్లడం అభిజీత్ కి ససేమిరా ఇష్టం లేదన్నట్లు ఆయన మాట్లాడాడు. మోనాల్ విషయం వచ్చిన ప్రతి సారి నేను ఇబ్బందులపాలవుతున్నట్లు చెప్పాడు. మోనాల్-అభిజిత్ ఒక జంట అని బయట ప్రొజెక్ట్ కావడం నాకసలు ఇష్టం లేదని హారికతో అభిజిత్ చెప్పాడు. మోనాల్ ని డేట్ కి తీసుకెళ్లడం ఇష్టం లేదని అభిజిత్ బిగ్ బాస్ తో చెప్పాడు.
undefined
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు అన్ని పూర్తి చేయాలని చెప్పిన బిగ్ బాస్, అభిజిత్ కి మోనాల్ తో డేట్ కి వెళ్లడం ఇష్టం లేని కారణంగా, అఖిల్ మోనాల్ తో గ్రేవ్ యార్డ్ కిడేట్ కి తీసుకెళ్లాలని ఆదేశించాడు. దానికి అఖిల్ ఒప్పుకున్నాడు. మోనాల్ తో స్మశానానికి డేట్ కి వెళ్ళాడు.
undefined
స్మశానంలో డేట్ కి వెళ్లిన మోనాల్, అఖిల్ ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉండగా, బిగ్ బాస్ దెయ్యం సాంగ్ ప్లే చేశాడు. ఆ సాంగ్ కి సోహైల్ భయంకరంగా డాన్స్ చేశాడు. మొత్తంగా నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
undefined
click me!