ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆవేశానికి గురైన బాలయ్య.. రామారావులా అందరికి వర్కౌట్‌ కాదంటూ షాకింగ్‌ కామెంట్

First Published Jun 10, 2021, 8:41 PM IST

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సినిమాల్లో ఉన్నాం కదా అని, రామారావుగారు అయ్యారు కదా అని అందరికి వర్కౌట్‌ కాదని ఆవేశానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్లు చేశారు.

గత కొన్ని రోజులుగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు పర్యటనలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. చంద్రబాబు ఆచితూచి స్పందించారు. ఇప్పుడు బాలయ్య ఏకంగా ఆవేశానికి లోనయ్యారు.
undefined
ఓ ప్రముఖ టీవీ(టీవీ9) ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై, టీడీపీలోకి రావడంపై మీ స్పందనేంటి? ఆయన ఎంట్రీ పార్టీకి ప్లస్‌ అనుకుంటున్నారా? మైనస్‌ అనుకుంటున్నారా? అన్నప్రశ్నకి తికమక సమాధానం చెప్పారు బాలయ్య.
undefined
ఎవరి ఇష్టాలు వారివి అని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనే వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అలాగే దీనిపై కార్యకర్తలు కూడా తమ ఇష్టాలను తెలియజేసే అవకాశం, స్వేచ్ఛ ఉందని పరోక్షంగా చెప్పారు.
undefined
ఇంతలోనే ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావడం పార్టీకి ప్లస్‌ కావచ్చు, మైనస్‌ కూడా కావచ్చు అన్నారు.ప్లస్ ప్లస్‌ మైనస్‌ అని, మైనస్‌ మైనస్‌ ప్లస్‌ అంటూ తికమక సమాధానం చెప్పారు. కాసేపు యాంకర్‌ని తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు.
undefined
అంతలోనే ఆవేశానికి గురయ్యారు. ఆనాడు రామారావుగారు సినిమాల్లో ఉండి, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యారు. రామారావులా సినిమాల్లో ఉన్నాం కదా అని అనుకుంటే అందిరికి వర్కౌట్‌ కాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీపై ఆయన ఓ రకంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
undefined
అదే సమయంలో తెలుగు దేశం ట్రాన్ఫ్సరెన్సీ లో నుంచి, ఆవేశంలోనుంచి పుట్టిందని, ట్రాన్స్ఫరెన్సీగా ఉన్నవారికి ఇందులో స్థానమన్నారు. తాను అలానే ఉంటానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు కూడా అలానే ఉంటారని చెప్పారు. డిప్లామాటిక్‌ నుంచి పార్టీ పుట్టలేదన్నారు.
undefined
పార్టీని యూత్‌పై దృష్టిపెట్టాలని తాను చెప్పానని, లేదంటే నాకు అప్పజెప్పమని, తాను ఆ బాధ్యతలు చూసుకుంటానని చెప్పారట.
undefined
click me!