4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : May 06, 2025, 07:41 AM IST

4 జాతీయ అవార్డులను గెలుచుకున్న హీరో. ఒకే ఏడాది 34 సినిమాలు విడుదల చేసిన రికార్డు ఆయన సొంతం,  స్టార్ హీరోలు కూడా ఆయన ముందు మాట్లాడటానికి ఆలోచించాల్సిందే. అన్నింటికంటే ముఖ్యంగా  సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవి కలిగి ఉన్న హీరో ఎవరో తెలుసా? 

PREV
16
4 జాతీయ అవార్డులు, లెఫ్టినెంట్ కల్నల్ పదవి, ఒక ఏడాది 34 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజ నటులు ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి వారు బాగా ప్రసిద్ధి చెందిన పేర్లు, కానీ మరో నటుడు తన నటన, సినిమాలకు చేసిన కృషికి గాను 4 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.  ఒక ఏడాదిలో 34 సినిమాలు రిలీజ్ చేయడంతో పాటు.. అనేక అవార్డ్ లు, సైన్యంలో హోదాను పొందారు. ఇంతకీ ఆ హీరో ఎవరో  ఎవరో కాదు మలయాళ సూపర్ స్టరా్ మోహన్ లాల్.

26

మోహన్ లాల్ భారతం, వానప్రస్థం సినిమాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. న్యూస్ 18 నివేదిక ప్రకారం, పులిమురుగన్, ముంతిరివల్లికల్ తలిర్కుంబోల్, జనతా గ్యారేజ్ చిత్రాల నిర్మాణానికి ప్రత్యేక జ్యూరీ జాతీయ అవార్డు లభించింది.

36

1986లో మోహన్ లాల్ నటించిన 34 సినిమాలు ఒకే ఏడాది విడుదలయ్యాయి. వీటిలో 25 సినిమాలు విజయవంతమయ్యాయి. ఇది ఒక అరుదైన రికార్డు.

46

మోహన్ లాల్ 14 సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయబడ్డాయి. వీటిలో చాలా వరకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. హంగామా, గరం మసాలా, క్యోంకీ, ఖట్టా మీఠా, దృశ్యం, దృశ్యం 2 వంటి హిట్ చిత్రాలు ఇందులో ఉన్నాయి.

56

2009లో భారత ప్రాదేశిక సైన్యం మోహన్ లాల్‌కు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేసింది. ఇలాంటి అరుదైన ఘనత పొందిన ఏకైక నటుడు మోహన్ లాల్. 

66

ఇటీవల వేవ్స్ సదస్సులో అక్షయ్ కుమార్‌ను స్పీకర్‌గా ఆహ్వానించినప్పుడు, వేదికపై మోహన్ లాల్ కూడా ఉన్నందున, ఆయనపై గౌరవంతో మాట్లాడటనికి అక్షయ్  తిరస్కరించారు. మోహన్ లాల్ అంటే అంత గౌరవం ఇస్తుంది ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 

Read more Photos on
click me!

Recommended Stories