గుంటూరు కారంలో ఈ మిస్టేక్ గమనించారా? త్రివిక్రమ్ కి ఆ మాత్రం తెలియదా?

Published : Jan 12, 2024, 03:03 PM ISTUpdated : Jan 12, 2024, 04:00 PM IST

గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ మూవీలో ఓ భారీ మిస్టేక్ గమనించిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

PREV
15
గుంటూరు కారంలో ఈ మిస్టేక్ గమనించారా? త్రివిక్రమ్ కి ఆ మాత్రం తెలియదా?


గుంటూరు కారం మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదలైంది. చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు నుండి వారు కోరుకునే మాస్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కథ, కథనాల విషయంలో త్రివిక్రమ్ నిరాశపరిచాడనే వాదన ఉంది. 

25

వీటన్నింటికీ మించి గుంటూరు కారంలో ఒక బ్లండర్ మిస్టేక్ గమనించారు. సౌండ్ మిక్సింగ్ సరిగా లేదనేది ప్రధాన ఆరోపణ. కొన్ని చోట్ల డైలాగ్స్ ని బీజీఎమ్ డామినేట్ చేసింది. మహేష్ బాబు డైలాగ్స్ అర్థం కాలేదని. ముఖ్యంగా యూఎస్ ప్రింట్ లో ఈ సమస్య ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

35

దర్శకుడు త్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్రివిక్రమ్ ఇలాంటి కీలక విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూడకుండానే విడుదల చేశారా ఏంటీ? అని ఎద్దేవా చేస్తున్నారు.  నిజానికి గుంటూరు కారం చిత్రాన్ని హడావుడిగా పూర్తి చేసి రిలీజ్ చేశారు. 

45

పోస్ట్ ప్రొడక్షన్ కి నెల రోజుల సమయం కూడా దొరకలేదు. విడుదలకు ఓ మూడు వారాల ముందు షూటింగ్ పూర్తి అయ్యింది. మొదటి నుండి గుంటూరు కారం అవుట్ ఫుట్ పై అనుమానాలు ఉన్నాయి. అనుకున్నట్లే తప్పులు తడకలతో సినిమా రిలీజ్ చేశారు. కథ, కథనాలు వదిలేసి మహేష్ క్యారెక్టర్ మీద ఆధారపడి తెరకెక్కించారు. 

55
Guntur Kaaram

త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ రీమేక్స్ మీద ఉన్న శ్రద్ధ తాను డైరెక్ట్ చేస్తున్న చిత్రాలపై లేకపోవడం శోచనీయం. మహేష్ మూవీ షూటింగ్ మొదలయ్యాక కూడా త్రివిక్రమ్ బ్రో మూవీకి కథనం, డైలాగ్స్ సమకూర్చడంలో బిజీ అయ్యాడు. సరైన స్క్రిప్ట్ లేకుండా గుంటూరు కారం చిత్రాన్ని తెరకెక్కించి వదిలాడు. కేవలం మహేష్ మేనియాతో మూవీ ఆ మాత్రం నిలబడింది. 

click me!

Recommended Stories