భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి అభిమానులతో సినిమా చూసిన మహేష్‌ బాబు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్

Published : Jan 12, 2024, 02:31 PM IST

సూపర్ స్టార్ మహేష్‌ చాలా అరుదుగా ఫ్యాన్స్ మధ్యకు వస్తుంటాడు. ఆయన అడపాదడపా కనిపిస్తుంటాడు. కానీ ఈ సంక్రాంతిని మాత్రం చాలా స్పెషల్‌గా మార్చేశాడు.   

PREV
16
భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి అభిమానులతో సినిమా చూసిన మహేష్‌ బాబు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్

మహేష్‌బాబు ఫ్యాన్స్ కి ఊహించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆయన సింగిల్‌ థియేటర్లోకి వచ్చాడు. సడెన్‌గా తమ మధ్యలోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు తన ఫ్యామిలీతో కలిసి ఆయన థియేటర్లలో సినిమా చూసే ఆడియెన్స్ కి ట్విస్ట్ ఇచ్చాడు. 

26

మహేష్‌బాబు నటించిన `గుంటూరు కారం` సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ అర్థరాత్రి నుంచి సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. 
 

36

ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి అభిమానుల మధ్య సింగిల్‌ థియేటర్లలో సినిమా చూడటం విశేషం. భార్య నమత్ర, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ఆయన ఆర్‌టీసీ ఎక్స్ రోడ్ లోని సుదర్శన్‌ థియేటర్ లో ఈ మధ్యహ్నం షో వీక్షించారు. 
 

46

ఆయనతోపాటు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌, అలాగే దిల్‌రాజు, వీరితోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, అలాగే నమ్రత సిస్టర్‌ కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఇలా సూపర్‌ స్టార్‌ని, వారి ఫ్యామిలీని చూడటంతో అబిమానులు ఆశ్చర్యపోయారు. అరుపులతో హోరెత్తించారు. 
 

56

అభిమానులకు మహేష్‌బాబు అభివాదం తెలిపారు. వారిని కాసేపు ఖుషి చేశాడు. తనదైన మేనరిజంతో ఆయన థియేటర్లలో రచ్చ చేశాడు. అభిమానులు మధ్య సినిమా చూస్తే వాళ్లనుంచి వచ్చే కిక్‌ని ఆస్వాధించాడు మహేష్‌. 
 

66

మహేష్‌బాబు, శ్రీలీల జంటగా నటించిన `గుంటూరు కారం` చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి చిన్న పాత్రలో మెరిశారు. ప్రకాష్‌ రాజ్‌, జయరాం, వెన్నెల కిషోర్‌, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories