న్యూడ్‌గా పరిగెత్తుతూ బర్త్ డే చేసుకున్న బాలీవుడ్‌ నటుడు (ఫోటో వైరల్‌)

First Published Nov 4, 2020, 8:31 PM IST

బాలీవుడ్‌ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ తన బర్త్‌ డేని వెరైటీగా ప్లాన్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుని తనకు తానే విశెష్‌ చెప్పుకున్నాడు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటో షాక్‌కి గురి చేస్తుంది. 

బాలీవుడ్‌ సూపర్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ పుట్టిన రోజు నేడు(బుధవారం). నేటితో ఆయన తన 55వ బర్త్ డేని జరుపుకున్నారు. ఎప్పుడు పరిగెత్తుతూ వార్తల్లో నిలిచే ఈ యాక్టర్‌ తన పుట్టిన రోజుని డిఫరెంట్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేశాడు.
undefined
ప్రతి దాంట్లోనూ కొత్త దనం కోరుకునే మిలింద్‌ సోమన్‌ ఫిట్‌నెస్‌కి మారుపేరు. యాభైఐదు ఏళ్ళ వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తన పుట్టిన రోజు కావడంతో గోవాకి చెక్కేసిన ఆయన ఉదయం నగ్నంగా పరిగెత్తుతూ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. బీచ్‌లో సూర్య రశ్మి పడే సమయంలో ఆయన ఇలా పరిగెత్తడం ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
ఈ ఫోటోని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు మిలింద్‌. అంతేకాదు తనకు తానే బర్త్ డే విశెష్‌ చెప్పుకున్నారు. అయితే ఈ ఫోటోని ఆయన భార్య అంకితా కోన్‌వార్‌ తీయడం విశేషం. ఈ ఫోటోని ఆయన అభిమానులు స్పందిస్తూ విశెష్‌ చెబుతున్నారు. మిలింద్‌ ఇన్నోవేటివ్‌ థింకింగ్‌కి అభినందనలు చెబుతూనే సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు దీనిపై మీమ్స్ చేస్తూ జోక్స్ పేలుస్తున్నారు. యాబై ఐదేళ్ల వయసులోనూ ఐదేళ్ల పిల్లాడిగా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined
2000లో `టర్కీబ్‌` చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌లో పరిచయం అయిన మిలింద్‌ `సూర్య`, `అగ్రి వర్ష`, `జర్మ్‌`, `భాగ్‌మతి`, `సే సలామ్‌ ఇండియా`, `షాడో`, `నక్షత్ర`, `బాజీరావు మస్తానీ `వంటి చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా మెప్పించారు. ఇక `సత్యమేవ జయతే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఒక్క సినిమాలోనే ఆయన నటించారు.
undefined
మిలింద్‌ స్పోర్ట్స్ మేన్‌ కూడా. ఆయన స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొంటారు. అంతర్జాతీయ స్విమ్మర్‌గా నిలిచారు. అనేక గేమ్స్ లో ఛాంపియన్‌ షిప్‌గానూ నిలిచారు. మరోవైపు ఎప్పుడూ ఆయన పరుగెత్తుతూ కనిపిస్తారు. పరిగెత్తుతూనే ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆ జర్నీని, ట్రావెలింగ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు. తన ఫిట్‌నెస్‌ని చాటుకుంటూ పాపులర్‌ అయ్యారు.
undefined
మిలింద్‌ మొదట మైలెన్‌ జాంపనోయిని వివాహం చేసుకున్నారు. 2006లో చేసుకుని 2009లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం అంకితా కోన్వర్‌ని మ్యారేజ్‌ చేసుకున్నారు.
undefined
click me!