MGR నుంచి విజయ్ వరకు తమిళ రాజకీయాల్లో సంచలన సినీ తారలు

First Published Feb 3, 2024, 12:49 PM IST

దేశం మొత్తం మీద సినీరాజకీయం ఎక్కువగా ఉండేది తమిళనాడు రాష్ట్రంలోనే. జాతీయ పార్టీలనుంచి అధికారం తీసుకుని.. ప్రాంతీయ పార్టీలు తమిళనాడును ఏలుతన్నప్పటి నుంచీ.. సినిమా వాళ్లే రాష్ట్రంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు. అంతే కాదు తమిళనాడును ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఏలింది కూడా సినిమాతారలే.. 

Vijay

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పార్టీని ప్రకటించారు. తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.తమిల మున్నేట్ర కుజగం పేరుతో పార్టీని ప్రకటించారు విజయ్. చాలాకాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తారని భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. తనకు ఆప్రచారంత సంబంధం లేదు అనిబుకాయిస్తూ వచ్చిన విజయ్.. చాపకింద నీరుల ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్లారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే విజయ్ పార్టీని ప్రకటించారు. త్వరలో పాలిటిక్స్ లో యాక్టీవ్ కాబోతున్నారు. ఇక 2026 ఎన్నికలే టార్గెట్ గా పనిచేయబోతున్నారు విజయ్. 

Karunanidhi MGR

అయితే విజయ్ కంటే ముందు తమిళనాడులో సినిమా రాజకీయ కొత్త కాదు. అసలు తమిళనాడును ఏలిందే సినిమా వాళ్ళు. కాంగ్రేస్ పార్టీనుంచి అధికారం తీసుకుని ప్రాంతీయ పార్టీలు తమిళనాడును ఏలడం స్టార్ట్ చేసినప్పుటి నుంచి.. సినిమావాళ్లే.. తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఎమ్జీఆర్.. ఆతరువాత సినిమా జాతికి చెందిన అన్నాదురై పెట్టిన డీఎంకే పార్టీలో చేరారు.. స్వతహాగా సినిమావారైన అన్నాదురై.. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. ఇక అన్నాదురై ద్రవిడ ఉద్యమం, పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో ఆల్ రెడీ ఉన్న రచయిత.. సినిమా ప్రభావం ఎక్కువగా ఉన్న కరుణానిథితో ఎమ్జేఆర్  స్నేహంచేశారు. అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన మరణించిన తరువాత కరుణానిథి ముఖ్యమంత్రి అయ్యారు.

Makkal Thilagam MGR

ఎమ్జీఆర్ ఎంత పెద్ద హీరోనో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట హీరోగా లక్షలాది హృదయాలను గెలుచుకున్నారు ఎమ్జీఆర్. తెలుగులో ఎన్టీఆర్. తమిళంలో ఎమ్జీఆర్ ను దైవసమానులుగా కొలిచేవారు ప్రజలు. ఇక డీఎంకేలో   కరుణానిథితో మనస్పర్ధల కారణంగా ఎమ్జీఆర్( MGR)బయటకు వచ్చి.. అప్పటికే తన బంధువులు పెట్టినటువంటి ADMK లో చేరారు. పార్టీపై పట్టు సాధించి.. పార్టీకి అధిపతిగా ఎదిగారు.. ఆతరువాత ADMK ను AIADMK గా మార్చి.. తమిళ ప్రజల మనసులు మరోసారి గెలుచుకున్నారు. ఎలక్షన్స్ లో కూడా గెలిచి.. రెండు సార్లుముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 
 

Jayalalitha

ఇక ఈక్రమంలో ఎమ్జీఆర్ తో దాదాపు 30కి పైగాసినిమాలు చేసిన హీరోయిన జయలలిత.. అన్నాడీఎంకేలో చేరి..ఎమ్జీఆర్ తో కలిసి పనిచేసింది.. పార్టీపై పట్టు సాధించి ముఖ్య నేతగా ఎదిగింది. అయితే పార్టీలో ఆమెపూ వ్యతిరేకత ఉన్నా.. తన పనితనంతో అందరి మనసు గెలుచుకుంది జయలలిత.. ఎమ్జీఆర్ ముఖ్యమంత్రిగా  ఉండి.. సడెన్ గా మరణించడంతో.. పార్టీలోకుదుపులు వచ్చాయి. అయినా సరే జయలలిత నిలబడి.. చెల్లా చెదురు అయిన పార్టీని నిలబెట్టి 6సార్లు ముఖ్యమంత్రిగా చేసింది. ఆమె తమిళ ప్రజలచేత అమ్మ అని పిలిపించుకున్నారు.ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలతను ఆమె చిరస్థాయిగా నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే అనారోగ్యంతో ఆమె మరణించారు. 

ఇక తమిళనాటు పార్టీలు పెట్టిన సినిమా వాళ్ళు చాల మంది ఉన్నారు. ప్రస్తుతం తమిళ ఆరాధ్య నటులుగా కొలవ బడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీని ప్రకటించి.. రంగంలోకి దిగబోయే సమయానికి.. అనారోగ్యం కారణంగా వెనక్కి తగ్గారు.. అటు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించి ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ ఎలక్షన్స్ లో గెలవకపోయినా.. రాజకీయాలను మాత్రం ప్రభావితం చేస్తున్నారు. 

ఇక రీసెంట్ గా మరణించిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ కూడా 2005 లో ADMK పార్టీని స్థాపించారు. జనాలలో చాలాఫాలోయింగ్ ఉన్న విజయ్ కాంత్... కొన్ని సీట్లు సాధించారు కాని...ముఖ్యమంత్రి కాలేకపోయారు. జయలలిత తోవివాదాలు కారణంగా తన పార్టీ చాలా నష్టపోయినా.. గట్టిగా నిలబడ్దారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి వరకూ వెళ్లిన విజయ్ కాంత్.. ఆతరువాత అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంఅయ్యారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 28న విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. 

ఇక తమిళనాట రాజకీయాల్లో మరోహీరో శరత్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన కూడా  ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పేరుతో పార్టీని స్థాపించారు. కాని ఆయన కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. పెద్ద పార్టీలతో కూటముల్లో చేరి.. ప్రభుత్వాలకు మద్దతు ఇస్తూ.. గడిపేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ.. పార్టీని.. సినిమాలను బ్యాలన్స్ చేస్తూ వస్తున్నారు. 

ఇక తమిళనాట ఇంకా చాలామంది తారలు రాజకీయాలను ప్రభావితం చేశారు. నటుడు విశాల్ కూడా ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయారు. అటు హీరోగా పలు సినిమాలు చేసిన ఉదయనిథి స్టాలిన్.. ప్రస్తుతం తమిల మంత్రిగా ఉన్నారు. అటు  సీనియర్ హీరోయిన్ కుష్బు ప్రస్తుతం బీజేపీల్ కొనసాగుతున్నారు. మహిళా కమీషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారు కుష్బు. అంతే కాదు శివాజీ గణేషన్, రామస్వామి లాంటి స్టార్స్ కూడా రాజకీయాల్లో రాణించారు. 
 

click me!