పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోతోంది. నటన పరంగానే కాకుండా.. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది.
26
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే మెహ్రీన్ తన వ్యక్తిగత విషయాలను అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా హనీ బేబీ తాజాగా అదిరిపోయే ఫొటోస్ ను షేర్ చేసుకుంది.
36
చివరిగా ‘ఎఫ్3’తో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఫారెన్ ట్రిప్ కు వెళ్లింది. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ సరదగా గడుపుతోంది. ఈ సందర్భంగా అక్కడి ఫొటోలను అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది.
46
యూనైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో ప్రస్తుతం తన హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించిన మెహ్రీన్ చికాగో వీధుల్లో హంగామా చేస్తోంది. అందాలు ఆరబోస్తూ మతిపోయేలా పోజులిచ్చింది. సూర్యుడికే తన సోయగాలతో చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
56
నిత్యం తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో తన క్రేజ్ పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీకి తెలుగు ఆడియెన్స్ లో తగిన గుర్తింపు లభిస్తోంది. ఇదే జోష్ తో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటోంది.
66
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘ఎఫ్2’ మరియు ‘ఎఫ్3’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.