‘వాల్తేరు వీరయ్య’ రోటీన్ కథే.. కానీ ఫుల్ మీల్స్ పక్కా.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

First Published Dec 28, 2022, 1:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలు పెంచేస్తోంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమాపై ఫస్ట్ రివ్యూను మెగాస్టార్ చిరంజీవి మాటల్లో అందించడం విశేషం.
 

Waltair Veerayya

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ Waltair Veerayya సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి - శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

Waltair Veerayya

వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్న విషయం తెలిసిందే. ఇక చిత్ర యూనిట్ సైతం ప్రచార కార్యక్రమాలతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. 
 

Waltair Veerayya

తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లను అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ సినిమాపై ఫస్ట్ రివ్యూను అందించడం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

Waltair Veerayya

సినిమా కథ, కథనం రోటీన్ గానే ఉంటాయి. కానీ చిత్రంలోని ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ సరికొత్తగా ఉంటాయని తెలిపారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ తర్వాత ఆ తరహా కామెడీని ఈ చిత్రంలో చూడొచ్చని చెప్పారు. వింటేజ్ లుక్ అభిమానులకు ఫుల్ మీల్స్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

Waltair Veerayya

సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అన్ని నెంబర్స్ ను అద్భుతంగా అంచారని తెలిపారు. మాస్ అండ్ క్లాస్ కలిపి దుమ్ములేపారన్నారు. ఇక శేఖర్ మాస్టర్ బ్రహ్మండమైన కొరియోగ్రఫీ అందిచారని, ‘పూనకాలు లోడింగ్’లో డాన్స్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ కు పండగేనని తెలిపారు.
 

Waltair Veerayya

యాక్షన్ సీక్వెల్స్ ను స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నెక్ట్స్ లెవల్లో రూపొందించారని తెలిపారు. సినిమా రోటీన్ యాక్షన్ అయినప్పటికీ అదిరిపోయే ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పొకొచ్చారు. తన అభిమాని అయిన బాబీ తనను స్క్రీన్ పై నెక్ట్స్ లెవల్లో ప్రజెంట్ చేశారన్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించబోతుండటంతో సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.  

click me!