మెగాస్టార్‌ నెక్ట్స్ షాకింగ్‌ లైనప్‌.. ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లు, బిగ్‌ బ్యానర్స్..? ఫ్యాన్స్ కి పండగే!

First Published | Oct 4, 2023, 3:44 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నెక్ట్స్ సినిమాల లైనప్‌ షాకిచ్చేలా ఉంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లని లైన్‌లో పెట్టారు. వీటికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

`భోళాశంకర్‌` చిత్రం డిజాస్టర్‌ కావడంతో మెగాస్టార్‌ చిరంజీవి ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. నెక్ట్స్‌ ఏంటీ? అనే కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. కరెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుందనే క్లారిటీ లేదు. ఆ మధ్య బర్త్ డే సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేశారు. `బింబిసార` ఫేమ్‌ వశిష్టతో ఓ చిత్రాన్ని, అలాగే తన కూతురు సుస్మిత బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. నెక్ట్స్ వెంటనే వశిష్ట సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. ఇది సోషియో ఫాంటసీగా ఉండబోతుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 
 

మరి కళ్యాణ్‌ కృష్ణ సినిమా పరిస్థితేంటనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయినట్టు సమాచారం. చిరంజీవి ఈ సినిమాని పక్కన పెట్టారట. కథ `బ్రో డాడీ`కి దగ్గరగా ఉండటంతో, పైగా కళ్యాణ్‌ కృష్ణ చిరుని మెప్పించేలా స్క్రిప్ట్ చేయలేకపోవడంతో దీన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే కొత్తగా క్రేజీ ప్రాజెక్ట్ లను మెగాస్టార్‌ లైనప్‌లో పెట్టినట్టు తెలుస్తుంది. ముగ్గురు స్టార్‌ డైరెక్టర్ల సినిమాలకు చిరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. బిగ్‌ బ్యానర్స్ తో ఆయన సినిమాలు చేయబోతున్నారట. 
 


చిరంజీవి.. లైనప్‌లో సుకుమార్‌, అనిల్‌ రావిపూడి, త్రివిక్రమ్‌ ఉన్నారట. ప్రస్తుతం ఓ కథని చిరంజీవితో చర్చలు జరుపుతున్నారట. గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్ ని సెట్‌ చేస్తుందని సమాచారం. అయితే గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా చేయక చాలా రోజులవుతుంది. 2005లో `అందరివాడు` సినిమా చివరిది. ఆ తర్వాత అంతా యంగ్ హీరోలతోనే చేస్తున్నారు. ఈనేపథ్యంలో దాదాపు 18ఏళ్ల తర్వాత చిరుతో మరో ప్రాజెక్ట్ ని సెట్‌ చేస్తున్నారట. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం సుకుమార్‌ `పుష్ప2` చిత్రం రూపొందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తర్వాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి పేర్లు వినిపించాయి. కానీ చిరంజీవితోనే ఉంటుందని లేటెస్ట్ సమాచారం. 

మరోవైపు చిరంజీవి ట్రాక్‌లోకి ఎంటర్‌టైనింగ్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా వచ్చారట. ప్రస్తుతం ఆయన `భగవంత్‌ కేసరి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది దసరాకి రాబోతుంది. ఆ తర్వాత చిరంజీవితో చేయాలనుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ కి కథ కూడా చెప్పారని, ఓ కొత్త పాయింట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా, యాక్షన్‌ మేళవింపుతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నారు. చిరంజీవి ఈ ప్రాజెక్ట్ విషయంలో సుముఖంగానే ఉన్నారని, దీన్ని దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నారని, తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌లో నిర్మించాలని భావిస్తున్నారు. 
 

అలాగే చిరంజీవి లైన్‌లోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా రావడం విశేషం. గత కొన్ని రోజులుగా చిరంజీవి, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉండబోతుందనే ప్రచారం ప్రారంభమైంది. ఆయన కూడా మెగాస్టార్‌కి కథ చెప్పారని, దాన్ని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారని సమాచారం. చిరంజీవి, త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్ట్ పై సీరియస్‌గా వర్క్ చేస్తున్నారని, దీన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం డీవీవీ.. పవన్‌ కళ్యాణ్‌తో `ఓజీ` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  త్రివిక్రమ్‌ ప్రస్తుతం.. మహేష్‌బాబుతో `గుంటూరు కారం` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. 
 

Latest Videos

click me!