బంపర్ ఆఫర్ కొట్టేసిన మీరా జాస్మిన్..పదేళ్ల తరువాత తెలుగులో సినిమా..

Published : Aug 17, 2023, 12:56 PM IST

తెలుగులో రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది మీరా జాస్మీన్. తాజాగా ఓ సినిమాలో  ఫుల్ లెన్త్ క్యారెక్ట్ చేయడం కోసం సైన్ చేసిందట.. ఇంతకీ మీరా ఏ సినిమాలో కనిపించబోతుందంటే..?

PREV
16
బంపర్ ఆఫర్ కొట్టేసిన మీరా జాస్మిన్..పదేళ్ల తరువాత తెలుగులో సినిమా..

కొన్నేళ్ల క్రితం తెలుగు తెరను ఊపు ఊపి వదిలిపెట్టింది హీరోయిన్ మీరా జాస్మిన్. చిన్న హీరోలు.. స్టార్ హీరోలు అని లేకుండా.. వరుస సినిమాలు... వరుస హిట్లు కొట్టింది. తరువాత తరువాత ఆమె హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యి.. కనిపించకుండా పోయింది. టాలీవుడ్ లో చేయడంలేదు కాని.. తమిళ, మలయాళంలోయాక్టీవ్ గానే ఉంది మీరా జాస్మిన్. 

26
Meera Jasmine

ఎప్పుడో 2013 లో వచ్చిన మోక్ష'  సినిమా  తర్వాత మీరా జాస్మిన్ తెలుగులో సినిమాలు చేయలేదు. మొన్న 'విమానం'లో తళుక్కున మెరిశారు. అది కూడా గెస్ట్ రోల్ మాత్రమే. అంతకు ముందు మాత్రం ఆమె  బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ .. రవితేజ, గోపీచంద్, రాజశేఖర్, శ్రీకాంత్, శివాజీ లాంటి హీరోల సినిమాల్లో తళుక్కున మెరిశారు. 

36
Meera Jasmine

మరీ ముఖ్యంగా మీరా జాస్మిన్ పవన్ కళ్యాన్ తో నటించిన గుడుంబా శంకర్,  శివాజీతో చేసిన 'అమ్మాయి బాగుంది'లో  రవితేజ  సరసన చేసిన భద్ర' సినిమా కూడా తెలుగులో పెద్ద హిట్. 'గోరింటాకు'లో రాజశేఖర్ చెల్లెలి పాత్రలో మీరా జాస్మిన్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బింగ్ సినిమా 'పందెం కోడి' కూడా మీరాకు మంచి హిట్ ఇచ్చింది. 
 

46
Meera jasmine

ఇక పదేళ్ల తరువాత టాలీవుడ్లో  మంచి అవకాశం సాధించిందట మీరా జాస్మిన్. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం మీరా జాస్మిన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఆఫర్ రాగానే ఆమె వెంటనే సైన్ చేసిందని సమాచారం. 

56
Meera Jasmine

సామజవరగమన' సినిమాతో ఈ ఏడాది కామెడీ హిట్ అందుకున్న యంగ్ స్టార్  శ్రీ విష్ణు....ప్రస్తుతం  'స్వాగ్' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా... ఆమెతో పాటు మరో హీరోయిన్ గా మీరా జాస్మిన్‌ కనిపించబోతున్నట్టు సమాచారం. మరి ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించపోయినా.. దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.  

66

తెలుగు ప్రేక్షకులు ఆల్మోస్ట్ మీరా జాస్మిన్ ను మర్చిపోయిన సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు సినిమాల్లో గానీ, ఆ సమయంలో ఇతర భాషల్లో చేసిన సినిమాల్లో గానీ మీరా జాస్మిన్ పద్ధతిగా కనిపించారు. డ్రస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండేది. ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసింది లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories