బ్లాక్‌ టాప్‌లో స్మైల్ తోనే చంపేస్తున్న మీరా జాస్మిన్‌.. క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ షురూ చేసిన పవన్‌ హీరోయిన్

Published : Nov 29, 2022, 01:19 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో డోస్‌ పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ షురూ చేసింది. చిలిపి పోజులతో ఎట్రాక్ట్ చేస్తుంది. 

PREV
18
బ్లాక్‌ టాప్‌లో స్మైల్ తోనే చంపేస్తున్న మీరా జాస్మిన్‌.. క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ షురూ చేసిన పవన్‌ హీరోయిన్

మీరా జాస్మిన్‌(Meera Jasmine) సెకండ్‌ ఇన్నింగ్స్ లో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్‌ షోతో రీఎంట్రీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ తోనే ఆమె అందాల ఆరబోతకి తెరలేపింది. తాజాగా ఈ బ్యూటీ హోమ్లీ లుక్ లో మెరిసింది. బ్లాక్‌ టాప్‌లో కనువిందు చేస్తుంది. క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో పాల్గొంది. 
 

28

ఓ హోటల్‌లో క్రిస్మస్‌ సందడి షురూ కాగా, ఇందులో మీరా పాల్గొంది. చిలిపి పోజులతో ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలను నెటిజన్లతో పంచుకుని గిలిగింతలు పెడుతుంది. తన క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుందీ బాలయ్య భామ. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

38

క్రిస్మస్‌ సెలబ్రేషన్‌కి ఇంకా నెల రోజులుంది. కానీ డిసెంబర్‌ని క్రిస్మస్‌ నెలగానే భావిస్తుంటారు. నెల రోజుల ముందు నుంచే ఆ సందడి ప్రారంభిస్తుంటారు. క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ సందడి తరచూ కొనసాగుతుంటుంది. మీరా కూడా ఇప్పుడు అలాంటి పనులో చేసేందుకు సిద్ధమవుతుంది. 
 

48

మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌ పదేళ్లకు ముందు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, రవితేజ, శివాజీ వంటి హీరోలతో నటించి అదరగొట్టింది. క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. స్టార్‌ ఇమేజ్‌తో టాలీవుడ్‌ని శాషించిన మీరా జాస్మిన్‌ అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. 

58

మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఫ్యామిలీ లైఫ్‌లో సెట్ కాలేదు. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఖాళీగా, స్వేచ్ఛగా మారిన మీరా జాస్మిన్‌ మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. 
 

68

ఇప్పటికే ఓ మలయాళ చిత్రంలో నటించింది మీరా జాస్మిన్‌. జయరాంతో ఆమె నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగుతోపాటు ఇతర సౌత్‌ ఇండస్ట్రీలపై ఫోకస్‌ పెట్టిందట. అందుకే మేకర్స్ దృష్టిలో పడేందుకు గ్లామర్‌ విందు వడ్డిస్తుంది. అందాలు ఆరబోస్తూ ఇంటర్నెట్‌లోనూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఓ వైపు తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

78

హోమ్లీ బ్యూటీగా తెలుగు తెరపై సందడి చేసిన మీరా జాస్మిన్‌ని కమ్‌ బ్యాక్‌ కోసం తెలుగు ఆడియెన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లో సినిమాలు చేయాలని కోరుతున్నారు. మరి మేకర్స్ ఆమెకి అవకాశాలిచ్చి తిరిగి టాలీవుడ్‌లోకి తీసుకొస్తారా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే పవన్‌ తో మీరా `గుడుంబా శంకర్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. 
 

88
meera jasmine

ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు నుంచి మీరాకు ఆఫర్లు వచ్చాయట. వెంకటేష్‌తో `నారప్ప` చిత్రం కోసం అడిగారట. కానీ తిరస్కరించిందట. మరోవైపు బాలకృష్ణతో `వీర సింహారెడ్డి`లోనూ అడిగారట. కానీ వదులుకుందని సమాచారం. స్టార్‌ హీరోలతో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories