చీరకట్టులో ‘గుంటూరు కారం’ బ్యూటీ మత్తెక్కించే ఫోజులు.. ఫుల్ బిజీ అయిన కుర్ర భామ

First Published | Nov 4, 2023, 10:37 AM IST

‘హిట్’ బ్యూటీ మీనాక్షి చౌదరి ఓవైపు వరుస ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా చీరకట్టులో మతులు పోగొట్టింది. 
 

క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ముద్దుగుమ్మ లైనప్ చాలా ఆసక్తికరంగా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. 
 

‘హిట్ : ది సెకండ్ కేస్’ చిత్రంతో మీనాక్షి చౌదరి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు ‘ఖిలాడీ’తోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ ను లైనప్ లో పెట్టింది. బడా హీరోలకు జోడీగా నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. 


మరోవైపు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు వరుసగా పోస్టులు పెడుతూనే వస్తోంది. నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. చీరకట్టులో మంత్రముగ్ధులను చేసింది.
 

బ్లాక్ అండ్ వైట్ లోనూ మీనాక్షి చౌదరి చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఇటీవల చీరకట్టులో మెరుస్తున్న ఈ బ్యూటీ తాజాగా సింపుల్ శారీలో ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో పద్ధతిగా మెరిసింది. కానీ మత్తెక్కించే ఫోజులతో కుర్ర హృదయాలను పిండేసింది. మీనాక్షి కిర్రాక్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ముంబైలోనే ఉంటోంది. షూటింగ్ ల నిమిత్తం హైదరాబాద్ కు వస్తూ వెళ్తోంది. అలాగే సోషల్ మీడియాలో మరింతగా ఫాలోయింగ్ పెంచేందుకు వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. 
 

తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. అరడజన్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ‘గుంటూరు కారం’, ‘విశ్వక్ సేన్ 10’, ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్’, తమిళంలో ‘సింగపూర్ సెలూన్’, ‘దళపతి 68’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఏకంగా మహేశ్ బాబు, విజయ్ దళపతి సరసన నటిస్తుండటం విశేషం. 

Latest Videos

click me!