మీనా ఇప్పుడు సీనియర్ హీరోలకు హాట్ కేక్ అయిపోయింది. `దృశ్యం` సినిమా హిట్ తర్వాత ఈ సీనియర్ భామ రేంజే మారిపోయింది. వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
`దృశ్యం` మలయాళంలో మోహన్‌లాల్‌తో జోడి కట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులోనూ వెంకటేష్ సరసన నటించింది.
ఇప్పుడు దీని సీక్వెల్స్ లోనూ అటు మలయాళంలో, ఇటు తెలుగులో మీనానే నటిస్తుండటం విశేషం.
దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్‌తోనూ జోడి కట్టిందీ భామ. రజనీ సరసన ఇప్పుడు `అన్నాత్తే` చిత్రంలో నటిస్తుంది. క్రమంలో సీనియర్లకి బెస్ట్ ఆప్షన్‌గా మీనా మారిపోతుంది.
సిమ్రాన్ సైతం సీనియర్లకి బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోలందరితోనూ ఆడిపాడింది సిమ్రాన్. కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.
ఇటీవల రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది. ఆ మధ్య రజనీతో `పేటా` చిత్రంలో రొమాన్స్ చేసింది. ఆడియెన్స్ ఫిదా చేసింది.
ఇప్పుడు తమిళంలో `రాకెట్రీ`లో మాధవన్ సరసన, `అంధగన్`లో కార్తీక్ సరసన నటిస్తుంది.
అలాగే రమ్యకృష్ణ సైతం సీనియర్లకి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రంలో నాగార్జున సరసన నటించి రొమాన్స్ పండించింది. వీరిద్దరి కాంబినేషన్ ఆనాటి హలో బ్రదర్స్ ని గుర్తు చేసిందంటే అతిశయోక్తి కాదు.
`బాహుబలి`లో రాజమాతగా అందరిని ఫిదా చేసింది.ఆ తర్వాత రమ్యకృష్ణకి కీలకమైన పాత్రలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె `రిపబ్లిక్`,`లైగర్` చిత్రాల్లో కీ రోల్స్ చేస్తుంది.
నేటి తరం హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందం రమ్యకృష్ణ సొంతం. ఇప్పటికీ అదే ఫిజిక్‌తో కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తుంది. అందుకే కీలక రోల్స్ దక్కించుకుంటుంది.
అంతేకాదు సీనియర్ హీరోలకు కూడా మంచి పాత్ర దక్కితే రమ్యకృష్ణ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటేన్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ తరహా పాత్రలతో మెప్పిస్తున్నారు మీనా, సిమ్రాన్, రమ్యకృష్ణ. ఈ రకంగా యంగ్ హీరోయిన్లకి పోటీనిస్తున్నారని చెప్పొచ్చు. సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసి విమర్శలు ఎదుర్కోవడం కంటే ఇలా అందమైన సీనియర్ భామలతో రొమాన్స్ చేయడం బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.