మంచు విష్ణు చిన్న కుమార్తె ఆర్య విద్య జన్మదిన వేడుకలు గురువారం రోజు ఘనంగా జరిగాయి. చిన్నారి ఆర్య అందమైన గౌనులో చిరునవ్వులు చిందిస్తూ, అల్లరి చేస్తూ ఏంజెల్ లా మెరిసిపోతోంది.
మంచు విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగా కూడా రాణిస్తున్నాడు. అయితే విష్ణుకి ఇటీవల సినిమాల్లో మంచి ఫలితాలు రాలేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
27
అయితే విష్ణు ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భార్య పిల్లలతో సంతోషంగా గడపడం చూస్తూనే ఉన్నాం. మంచు విష్ణు.. విరోనికా రెడ్డిని 2008లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు పిల్లా పాపలతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
37
మంచు విష్ణు, విరోనికా దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. అరియానా, వివియానా, అవ్రం, ఆర్య విద్య నలుగురు పిల్లలు జన్మించారు. ముగ్గురు అమ్మాయి, ఒక కొడుకు ఉన్నారు.
47
వీరిలో అరియానా, వివియానా కవల పిల్లలు కాగా ఆ తర్వాత అవ్రం, ఆర్య జన్మించారు. కాగా మంచు విష్ణు చిన్న కుమార్తె ఆర్య విద్య జన్మదిన వేడుకలు గురువారం రోజు ఘనంగా జరిగాయి.
57
చిన్నారి ఆర్య అందమైన గౌనులో చిరునవ్వులు చిందిస్తూ, అల్లరి చేస్తూ ఏంజెల్ లా మెరిసిపోతోంది. ఆర్య విద్య క్యూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
67
నా చిట్టి తల్లి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. మై లిటిల్ లవ్.. నా బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ మైలర్ అంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆర్య విద్య క్యూట్ పిక్స్ నెటిజన్లని భలే ఆకట్టుకుంటున్నాయి.
77
ఇదిలా ఉండగా మా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మంచు విష్ణు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా అసోసియేషన్ లో బాలీవుడ్ నటుల్ని కూడా భాగం చేసే కార్యక్రమాన్ని ఇటీవల మంచు విష్ణు చేపట్టిన సంగతి తెలిసిందే.