యువతని ఆకట్టుకునే వినోదం, కామెడీ అంశాలతో ట్రైలర్ బాగా వైరల్ అయింది. సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవన మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరి కామెడీ పంచ్ లు బాగా పేలాయి.