దీంతో మనోజ్ ప్రణతిని పెళ్లి చేసుకోగా, మౌనిక మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. కానీ వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా మౌనిక, మనోజ్‌లు టచ్‌లోనే ఉన్నారని తెలుస్తుంది. ఎవరికి వారు విడాకులిచ్చి ఫ్రీ అవడంతో మళ్లీ కలిసిపోయారని, ఈ లోపు భూమా నాగిరెడ్డి దంపతులు కూడా కన్నుమూశారు. దీంతో వారికి మంచు ఫ్యామిలీ పరోక్షంగా అండగా నిలిచిందని, అలా మళ్లీ మౌనిక మనోజ్‌కి దగ్గరయ్యిందని, ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం. త్వరలోనే మంచి రోజు చూసుకుని పెళ్లి ప్రకటన చేసే అవకాశం ఉందని, తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.