కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ మంచు లక్ష్మీ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. హోస్ట్ గా మంచు లక్ష్మీ అనేక షోలు చేశారు. అమెరికాలో బుల్లితెర హోస్ట్ గా రాణించిన ఘనత లక్ష్మీ మంచు సొంతం.
చాలా కాలం అమెరికాలో ఉండిపోయిన మంచు లక్ష్మీ ఇండియా వచ్చిన తరువాత, టాలీవుడ్ పై దృష్టి సారించారు. నటిగా హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించిన మంచు లక్ష్మీ తెలుగులో కూడా చిత్రాలు చేశారు.
2011లో విడుదలైన అనగనగా ఓ ధీరుడు మూవీలో మంచు లక్ష్మీ మంత్ర గత్తెగా విలన్ రోల్ చేశారు. మంచు లక్ష్మీకి అది తెలుగులో మొదటి చిత్రం. గుండెల్లో గోదారి మూవీలో మంచు లక్ష్మీ హీరోయిన్ గా కూడా చేశారు.
తెలుగులో పలు టాక్ షోలకు హోస్ట్ గా చేసిన మంచు లక్ష్మీ తన లవ్ గురించి తెలియజేశారు. అప్పట్లో మంచు లక్ష్మీ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే అమితంగా ఇష్టపడే వారట. వీలైతే అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.
ఐతే తన ప్రేమను అమీర్ ఖాన్ తో మంచు లక్ష్మీ చెప్పలేకపోయారట. అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్న సమయంలో మంచు లక్ష్మీ ఎక్కి ఎక్కి ఏడ్చారట.
అమీర్ ఖాన్ రెండవ పెళ్లి సమయంలో కూడా చాలా బాధపడినట్లు మంచు లక్ష్మీ తెలపడం గమనార్హం. తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఈ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
ఇక 2006లో మంచు లక్ష్మీ అమెరికాలో సెటిలైన అండి శ్రీనివాసన్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి ఉన్నారు.