Feel Good: కుర్రాళ్లని ఊపేస్తున్న మమ్మా మియా సాంగ్‌.. వైరల్‌గా మారిన ఫీల్‌ గుడ్‌ సినిమా పాట

Published : Oct 25, 2026, 09:02 PM IST

Feel Good Movie: ఫీల్‌ గుడ్‌ మూవీ నుంచి అదిరిపోయే రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది. `మమ్మా మియా` అంటూ సాగే పాటని విడుదల చేయగా, ఇది యువతరాన్ని బాగా ఆకట్టుకుంటోంది.

PREV
13
రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా రాబోతున్న `ఫీల్‌ గుడ్‌`

ప్రస్తుతం ఫ్యామిలీ చిత్రాలు, యాక్షన్‌ చిత్రాలతోపాటు మంచి ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. నిజానికి యూత్‌ఫుల్‌గా ఉన్న లవ్‌ స్టోరీస్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రొమాంటిక్‌ కామెడీ ప్రధానంగా `ఫీల్‌ గుడ్‌` అనే సినిమా రూపొందుతుంది. టైటిల్‌ కి తగ్గట్టుగానే స్టోరీ ఉండబోతుందట. ఈ చిత్రానికి దయానంద్‌ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించారు. సుచిత్‌ నిర్మాణంలో సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది.

23
ఫీల్‌ గుడ్‌ నుంచి మమ్మా మియా సాంగ్‌ ఔట్‌

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్‌. `ఫీల్‌ గుడ్‌` నుంచి అదిరిపోయే `మమ్మా మియా` అనే పాటని విడుదల చేశారు. శాండిల్య పిసపాటి సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు వైరల్‌గా మారింది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమని ఆవిష్కరించేలా, యువతని ఆకట్టుకునేలా, ఉత్సాహభరితంగా ఈ పాట సాగడం విశేషం. అందుకే ఈ తరాన్ని ఇది బాగా ఆకట్టుకుంటోంది. వైరల్‌గా మారింది. గాయకులు సాండిల్య పిసపాటి, తుషర నిలయ మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోందీ ఈపాట. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

33
కుర్రాళ్లని ఆకట్టుకుంటోన్న మమ్మా మియా

‘వైబ్‌’, ‘సింక్‌’, ‘ట్రెండ్‌’, ‘హైప్‌’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్‌ ఎనర్జీ కనిపిస్తుంది. ల‌వ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. ఈ పాటకి కడలి స‌త్య‌నారాయ‌ణ‌ సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో సుచిత్‌, అదితి త్రిపాఠితో పాటు రవూరి ప్రియాంక, లిఖిత్‌, రణధీర్‌ వాసుదేవ్‌, సైఫాని, దివ్య మోహన్‌ తదితరులు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట విడుదలతో ‘ఫీల్‌ గుడ్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని, యూత్ ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌ని చిత్ర బృందం ఆశిస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories