ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి, రామతో ఈ విషయం మనం అత్తయ్య గారికి చెప్పకూడదు మళ్ళీ వాళ్ళు బాధపడతారు వాళ్లకు తెలియకుండా డబ్బులు దాయాలి అని అంటుంది. ఇందులో జెస్సి వస్తుంది అప్పుడు ఇంటికి బయలుదేరుతాము అని జానకి అనగా, నాకు కొట్టులో పని ఉన్నది జానకి గారు మీరు వెళ్ళండి అని రామా అంటాడు. ఆ తర్వాత సీన్లో మల్లిక తింటూ ఉండగా గోవిందరాజు, జ్ఞానాంబ అక్కడికి వస్తారు. మల్లిక తిండి ఆపేస్తుంది అప్పుడు గోవిందరాజు, అమ్మ మా గురించి నువ్వు తినడం మనక్కర్లేదు.