Malavika Mohanan Celebrations : ‘మాస్టర్’ మూవీని రిపీట్ చేసిన మాళవిక.. పిల్లలతో కలిసి విమెన్స్ డే సెలబ్రేషన్స్

Published : Mar 09, 2022, 11:57 AM IST

హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) మానవత్వాన్ని చాటుకుంది. మహిళా దినోత్సం సందర్భంగా అనాథ బాలికలకు ఒక్కపూట భోజనం ఏర్పాట్లు చేసి, పిల్లల మధ్యే వేడుకలు  జరుపుకుంది. 

PREV
16
Malavika Mohanan Celebrations : ‘మాస్టర్’ మూవీని రిపీట్ చేసిన మాళవిక.. పిల్లలతో కలిసి విమెన్స్ డే సెలబ్రేషన్స్

మలయాళ నటి మాళవిక మోహనన్ (Malavika Mohanan) సినిమాల్లో నటిస్తూ  అలరించడంతో పాటు తనలోని హ్యూమన్ యాంగిల్ ను కూడా ఇప్పుడిప్పుడే బయటపెడుతోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైన మాళవిక మోహనన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చిన్న పిల్లలతో కలిసి ఘనంగా జరుపుకుంది. 
 

26

విమెన్స్ డే సందర్భంగా చాలా మంది నటీమణులు సోషల్ మీడియా వేదిన తమ విషెస్ తెలిపారు. తమకు తోచిన సూచనలు, సలహాలను అందించారు. కానీ మాళవిక మోహనన్  మాత్రం అందరూ మెచ్చుకునే వేడుకలు నిర్వహించుకుంది. 
 

36

కేరళకు చెందిన ఈ బ్యూటీ.. మహిళా దినోత్సవం సందర్భంగా చైన్నైలోని ఓ అనాథాశ్రమంలో సెలబ్రేషన్స్ నిర్వహించుకుంది.  పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి... అక్కడి మహిళలకు, బాలికలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. విమెన్స్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు మాళవిక ఎంతో సంతోషిస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది.  
 

46

ఫొటోలు  షేర్ చేస్తూ.. ‘మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ రోజు ఈ చిన్న పిల్లలతో కలిసి నా సమయాన్ని గడిపాను. నాకు ఇష్టమైన ఆహారాన్ని వారితో కలిసి తినాలని అనున్నాను. ఇందుకు మేము కేక్ కట్ చేశాం. బిర్యానీ తిన్నాం.  అనంతరం పిల్లలు నాతో 'మాస్టర్' మూవీ నుండి  రెండు డైలాగ్‌లు చెప్పించారు. చెన్నైకి వచ్చిన ప్రతిసారీ వారిని కలవాలని కోరారు.’ అని తెలిపింది.  
 

56

తమిళ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’మూవీలో మాళవికా హీరోయిన్ గా మెప్పింది. ఈ సినిమాలో మాళవిక పిల్లలకు స్వేచ్చా జీవితాన్ని ఇచ్చేందుకు పాటుపడుతుంది. మహిళా దినోత్సవాన్ని మాళవిక  పిల్లల మధ్య జరుపుకోవడం పట్ల మాస్టర్ మూవీ సన్నివేశాలను తలపించాయి. ఇందుకు మాళవికను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 
 

66

 ప్రస్తుతం మాళవికా తమిళ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘మారన్’ మూవీలో నటించింది. ఈ మూవీ చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలె తమిళం, తెలుగు భాషల్లో మారన్ మూవీ ట్రైలర్లను విడుదల చేశారు. ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. అలాగే మరో హిందీ చిత్రం ‘యుద్రా’లోనూ మాళవిక నటిస్తోంది.

click me!

Recommended Stories