హీరోయిన్ శోభన ఇంట్లో చోరీ, పనిమనిషి పనే అని తేలినప్పటికీ..గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

Published : Jul 29, 2023, 11:16 AM ISTUpdated : Jul 29, 2023, 11:18 AM IST

నటి శోభన గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. 80వ దశకం నుంచి 90 దశకం చివరి వరకు ఆమె సౌత్ లో ఎన్నో క్లాసిక్ అనదగ్గ చిత్రాల్లో నటించి మెప్పించారు. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

PREV
17
హీరోయిన్ శోభన ఇంట్లో చోరీ, పనిమనిషి పనే అని తేలినప్పటికీ..గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
Shobana

నటి శోభన గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. 80వ దశకం నుంచి 90 దశకం చివరి వరకు ఆమె సౌత్ లో ఎన్నో క్లాసిక్ అనదగ్గ చిత్రాల్లో నటించి మెప్పించారు. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, వెంకీ, బాలయ్య ఇలా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

 

27

ఐదు పదుల వయసు దాటినప్పటికీ శోభన వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు. శోభన మంచి నటి మాత్రమే కాదు అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్. దీనితో శోభన ప్రస్తుతం చెన్నైలో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ చెన్నైలో తన తల్లితో జీవిస్తున్నారు. అయితే శోభన నివాసంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 

37

శోభన ఇంట్లో చోరీ జరిగింది. శోభన ఇల్లు చెన్నైలోని శ్రీమాన్ శ్రీనివాస కాలనిలో ఉంది. అది రెండంతస్తుల భవనం. పైన పోర్షన్ లో శోభన, ఆమె తల్లి ఉంటారు. కింద డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ ఉంటుంది. శోభన తల్లి వృద్ధురాలు కావడంతో ఆమెకి సహాయంగా కడలూరుకి చెందిన విజయ అనే మహిళని పనిమనిషిగా పెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా శోభన తల్లి దగ్గర ఉన్న డబ్బు చోరీకి గురవుతోందని అనుమానం వచ్చింది. 

47

అయితే తన ఇంటికి ఇతరులెవరూ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చినా కింద డ్యాన్స్ స్కూల్ లోనే మాట్లాడి వెళ్ళిపోతారు. దీనితో పనిమనిషిపై శోభనకి అనుమానం కలిగింది. పనిమనిషిని ప్రశ్నించగా ఆమె బుకాయిస్తూ తనకేం తెలియదు అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. ఆమె ప్రవర్తన చూసి అనుమానం మరింత పెరగడంతో శోభన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంటర్ అయి గట్టిగా ప్రశ్నించడంతో పనిమనిషి విజయ నిజం ఒప్పేసుకుంది. 

57

మార్చి నుంచి అవకాశం ఉన్నప్పుడు దొంగిలిస్తూ ఉన్నానని మొత్తం రూ 41 వేలు దొంగిలించినట్లు విజయ ఒప్పుకుంది. ఆ డబ్బుని కారు డ్రైవర్ సహాయంతో గూగుల్ పే ద్వారా తన కుమార్తెకి ట్రాన్సఫర్ చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. అయితే విజయ తాను పేదరికం కారణంగానే ఈ పని చేశానని.. పని నుంచి తప్పించవద్దని శోభనని వేడుకుంది. 

67

దీనితో శోభన తన గొప్ప మనసు చాటుకుంది. విజయపై కేసు నమోదు చేయవద్దని పోలీసులని కోరడం మాత్రమే కాదు.. ఆమెని పనినుంచి తొలగించలేదు. దొంగిలించిన డబ్బుని జీతం నుంచి కట్ చేస్తానని చెప్పింది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవద్దని.. డబ్బు అంతగా అవసరం అయితే తనకి చెప్పాలని.. తగిన సాయం చేస్తానని విజయని శోభన మందలించింది. శోభన గొప్ప మనసుని నెటిజన్లు అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆమెకి హ్యాట్సాఫ్ అంటున్నారు. 

77

పనిమనిషి తప్పు చేసినప్పటికీ ఆమె ఆర్థిక సమస్య, ఫ్యామిలీ గురించి శోభన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని అని అంటున్నారు. శోభన తెలుగులో విక్రమ్, అజేయుడు, రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మురారి, రౌడీ గారి పెళ్ళాం, ఏప్రిల్ 1 విడుదల, రౌడీ అల్లుడు లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 

click me!

Recommended Stories