మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం.