తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. మహేష్ ఈ చిత్రం కోసం హెయిర్, గడ్డం పొడవుగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబా అని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎప్పుడూ హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ ఈ లుక్ లో బీస్ట్ లాగా ఉన్నాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ పూర్తిగా మారిపోయాడు.