ప్రభాస్‌, చిరంజీవి, బాలయ్యల హిట్‌ ఫార్మూలాని `గుంటూరు కారం`లో దించుతున్న మహేష్‌.. వర్కౌట్‌ అయ్యిందా ఇక మోతే

Published : Jan 08, 2024, 01:45 PM ISTUpdated : Jan 08, 2024, 03:16 PM IST

సినిమాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే ప్రభాస్‌, చిరంజీవి, బాలయ్య, శివరాజ్‌ కుమార్‌, రజనీ ఈ ట్రెండ్‌తో హిట్‌ కొట్టారు. దీంతో మహేష్‌బాబు కూడా వారినే కాపీ కొడుతున్నాడు. 

PREV
111
ప్రభాస్‌, చిరంజీవి, బాలయ్యల హిట్‌ ఫార్మూలాని `గుంటూరు కారం`లో దించుతున్న మహేష్‌.. వర్కౌట్‌ అయ్యిందా ఇక మోతే

సినిమాల్లో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంది. ఆడియెన్స్ అలాంటి వాటిని ఎక్కువ ఇష్టపడుతుండటంతో దాన్ని రిపీట్‌ చేస్తుంటారు మేకర్స్. సీన్ల పరంగానో, గెటప్‌ పరంగానో, మ్యానరిజం పరంగానో ఈ ట్రెండ్‌ నడుస్తుంది. అలా ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ నడుస్తుంది. ఇది పాతదే అయినా కొత్తగా మారింది. మాస్‌, యాక్షన్‌ సినిమాలకు పూనకాలు తెప్పిస్తుంది. కలెక్షన్ల పంట పండిస్తుంది. 

211

తాజా ఇటీవల వస్తోన్న సినిమాలో ఓ కొత్త ట్రెండ్‌ నడుస్తుంది. ఇటీవల యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. హీరోల ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉన్న సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. బీజీఎం మోత, హీరోల మ్యానరిజానికి ఫిదా అవుతున్నారు. అలా ఇప్పుడు బీడీల ట్రెండ్‌ నడుస్తుంది. హీరోల సిగరేట్‌గానీ, బీడీలుగానీ తాగే సీన్లకి ఫ్యాన్స్ థియేటర్లలో ఊగిపోతున్నారు. ఆయా సీన్లు వస్తే అరుపులతో హోరెత్తిస్తున్నారు. `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి`, `యానిమల్‌`, `జైలర్‌`, `సలార్‌` వరకు ఈ ట్రెండ్‌ కనిపించింది. సినిమాలో ఆయా సీన్లకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. దీంతో ఇప్పుడిదొక సక్సెస్‌ మంత్రగా మారింది. 
 

311

ఇటీవల వచ్చిన `సలార్‌` సినిమాలో ప్రభాస్‌ సిగరేట్‌ తాగే సీన్‌ దుమ్ములేచిపోయింది. మొదటి ఫైట్‌లో ఆయన స్టయిల్‌గా సిగరేట్‌ని వెలిగించుకోవడం, దాన్ని అంటించే సమయంలో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమేకాదు, సాధారణ ఆడియెన్స్ కూడా గూస్‌బంమ్స్ తెప్పించింది. `సలార్‌` సినిమాలో అదొక బెస్ట్ ఎలివేషన్‌ సీన్‌గా నిలిచింది. సక్సెస్‌ లో భాగమయ్యింది. ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన ఈ మూవీ ఏడు వందల కోట్లకు చేరువలో ఉంది. ఇంకా రన్నింగ్‌లో ఉంది. 
 

411

మరోవైపు ఇటీవల `యానిమల్‌`తో ఏడు వందల కోట్ల మార్క్ ని దాటేశాడు రణ్‌బీర్ కపూర్‌. సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన ఈ బోల్డ్ మూవీలోనూ రణ్‌బీర్‌ కపూర్‌ సిగరేట్‌ సీన్‌ అదిరిపోయింది. తన తండ్రిని కాపాడుకునేందుకు తన సైన్యంతో రణ్‌ బీర్‌ కపూర్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సీన్‌ వాహ్‌ అనిపించింది. సూపర్‌ స్టయిలీష్‌గా ఉంది. ఆ తర్వాత బైక్‌ పై సిగరేట్‌ తాగుతూ `అర్జున్‌ రెడ్డి` తరహాలో వచ్చే సీన్‌ కూడా బాగా పేలింది. ఆయా సీన్లకి ఆడియెన్స్ హో ఏసుకున్నారు. మరోవైపు ఇంటర్వెట్‌ ఫైట్‌ సీన్లో రణ్‌ బీర్‌ రక్తం మరకలతో సిగరేట్‌ తాగడం, క్లైమాక్స్  ఫైట్‌లో రణ్‌బీన్‌కి కొట్టాక అతనిపై పడుకుని బాబీ డియోల్‌ సిగరేట్ తాగే సీన్‌ కి థియేటర్లు దద్దరిల్లాయి. 
 

511

మెగాస్టార్‌ చిరంజీవి తన ఎన్నో సినిమాల్లో సిగరేట్, బీడీలు తాగారు. హిట్‌ అందుకున్నారు. కానీ `వాల్తేర్‌ వీరయ్య`లో మాత్రం ఆ సీన్‌ అదిరిపోయింది. అందులో చిరంజీవి పరిచయ సీన్ సముద్రంలో వస్తుంది.ఆ సమయంలో చిరు సిగరేట్‌ తాగుతూ ఫైట్‌ చేస్తూ వచ్చే సీన్‌కి థియేటర్లలో క్లాప్స్ పడ్డాయి. హీరో ఎలివేషన్‌ సీన్లలో బీడీ తాగడం అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ చిరంజీవిని చూడటంతో ఫ్యాన్స్ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. 

611

అలాగే సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా `వీరసింహారెడ్డి`లోనూ అలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. సినిమాలో సీనియర్ బాలయ్య పెళ్లి మండపానికి వచ్చేసమయంలో సుట్ట బీడీ తాగుతూ కారు దిగుతూ ఇచ్చే ఎంట్రీ ఇస్తూ మైండ్‌ బ్లాక్‌ అనేలా ఉంది. ఆ సీన్‌కి కూడా థియేటర్లు దద్దరిల్లాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఊగిపోయాయి. అలా రెండు మూడు చోట్లు ఇలాంటి సీన్లు పడ్డాయి. వాటికి భారీ హైప్‌, ఆదరణ లభించింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బీడీ తాగే సీన్లలో తమ హీరో ఎలివేషన్‌ చూసుకుని అరుపులతో హోరెత్తించారు అభిమానులు. 
 

711

అదే కాదు రజనీకాంత్‌ సినిమాలోనూ ఇది బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇటీవల ఆయన `జైలర్‌`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. వింటేజ్‌ రజనీ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నారు. ఇందులో శివ రాజ్‌ కుమార్‌ బీడీ తాగుతూ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే సీన్‌ సినిమా మొత్తానికి హైలైట్‌. ఆ సమయంలో శివరాజ్‌ కుమార్‌ బీడీ తాగే విదానం, దాని ఎలివేషన్‌కి ఒళ్లు గగుర్పొడిచాయి. ఆ సీన్లలో రజనీకాంత్, మోహన్ లాల్‌ సైతం బీడీలు తాగుతూ కనిపించి సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఆయా సీన్లు `జైలర్‌` విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

811

`కేజీఎఫ్‌2`లోనూ ఇదే ట్రెండ్‌ ఫాలో అయ్యాడు ప్రశాంత్ నీల్. అందులో హీరో యష్‌.. పోలీస్‌ స్టేషన్‌ని మిషన్‌ గన్‌తో పేల్చేస్తాడు. ఆ సినిమా అదిరిపోయింది. కాల్చేయడం అయిపోయాక.. నిప్పుల కొలిమిలా ఉన్న గను చివర యష్‌ సిగరేట్ ఎలిగించుకునే సీన్‌కి థియేటర్లలో ఊగిపోయాయి. పూనకాలు తెప్పించేలా ఉంది. ఆ సినిమా `కేజీఎఫ్‌2` మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 
 

911

మరి ఈ ఫార్మూలా ఇప్పుడు మహేష్‌బాబు కి వర్కౌట్‌ అవుతుందా? అనేది చూడాలి. `పోకిరి` సినిమాలో ఆయన సిగరేట్‌ సీన్లు బాగానే పేలాయి. మళ్లీ ఒకటి రెండు సినిమాల్లో వాడాడు కానీ పెద్దగా వర్క్ కాలేదు. కానీ ఇప్పుడు `గుంటూరు కారం`లో బీడీతో కనిపించాడు మహేష్‌. చాలా సందర్భాల్లో ఆయన బీడీ తాగుతూ, బీడీని నోట్లో తిప్పుతూ, స్టయిల్‌గా కాల్చుతూ కనిపించాడు. ట్రైలర్‌లో ఈ సీన్లు బాగా పేలాయి. సోషల్‌ మీడియాలో అవి వైరల్‌ అవుతున్నాయి. మరి ప్రభాస్‌, చిరు, బాలయ్య, రణ్‌బీర్, రజనీలకు వర్కౌట్ అయినా ఫార్ములా మహేష్‌కి వర్క్ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెంటిమెంట్ ప్రకారం, ట్రెండ్‌ ప్రకారం ఈ మూవీ కూడా బ్లాక్‌ బస్టర్‌ కొట్టబోతుందని తెలుస్తుంది.
 

1011

ఈ సంక్రాంతికి రాబోతున్న నాగార్జున సైతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఆయన `నా సామి రంగం`లో కూడా బీడీ తాగుతూ కనిపించాడు. టీజర్‌లోనూ అదే సీన్‌ హైలైట్గా నిలిచింది. సంక్రాంతి చిత్రం విడుదల కానుంది. మరి ఇలా మాస్, ఎలివేషన్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇతర స్టార్లకి వర్కౌట్‌ అయినట్టే నాగ్‌కి వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. 

1111

అయితే సిగరేట్‌, బీడీలు తాగడం ఆరోగ్యానికి హానీకరం. సినిమాల్లో ప్రారంభంలోనే ప్రభుత్వ యాడ్‌ వేస్తూనే ఉంటారు. కానీ స్టార్ హీరోలు వాటిని తుంగలోకి తొక్కి ఇలాంటి సీన్లని ఎంకరేజ్‌ చేయడం పట్ల విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ హిట్‌ కోసం సూపర్‌ స్టార్లుసైతం ఇలాంటి సీన్లనే ఆశ్రయించడం విచారకరం. భారీ ఫ్యాన్ బేస్‌, భారీ ఇమేజ్‌ ఉన్న బిగ్‌ స్టార్సే ఎక్కువగా ఇలాంటి సీన్లు చేయడం అత్యంత బాధాకరం. ఇది తమ అభిమానులను తప్పు దారి పట్టించడమే అవుతుందని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories