షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు

First Published | Oct 6, 2021, 11:44 AM IST

సమంత నాగ చైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటి?.? ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తెలియజేస్తూ సినీ నటి మాధవీలత తన ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘వందలో 99 కామెంట్స్ సమంత గురించి బ్యాడ్‌గానే మాట్లాడుతున్నారు.  సినిమా ఫీల్డ్‌లో విడాకులు అనేది ఒక పార్ట్. అదో ఎమోషనల్ ఇష్యూ.

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య విడాకుల విషయమై  చర్చే.  దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకొని, నాలుగేళ్ల క్రితం( పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడంతో.. అక్కినేని,సమంత అభిమానులతో పాటు సామాన్యలు కూడా షాక్‌కు గురయ్యారు. అంత అన్యోన్యంగా ఉండే వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు కూడా చై-సామ్‌ విడాకులపై స్పందించారు. స్పందిస్తున్నారు. తాజాగా సినీనటి,మరియు రాజకీయనాయకురాలు మాధవీలత కూడా మాట్లాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఫేస్‌ బుక్‌ లైవ్‌లోకి వచ్చిన మాధవీలత.. . చై-సామ్‌ విడాకులపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 
 


విడాకుల విషయంలో హీరోయిన్ సమంత తప్పు లేదని చెప్తోంది మాధవీలత. సమంతని తప్పు పట్టకూడదు అని అంటోంది ఈ భామ. ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో రకరకాల విషయాలపై ఈ భామ ముచ్చటిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా సమంత గురించి మాట్లాడింది.



 పెద్ద ఫ్యామిలీస్‌కి పెద్ద మనసు ఉంటుంది అనే ఆలోచనలు మానేయండి. ఆమె డబ్బు మనిషి కాదు. సినిమాలు చేశాక వచ్చే మనీ ఏమి చేయాలో కూడా తెలియని అమాయకురాలు. ఒక హీరో ఆమెను గ్రాబ్ చేసి మనీ అంతా వాడేసుకున్నాడు. పెళ్లైన తరువాత ఆమెలో పరివర్తన వచ్చింది. ఆమె సంపాదించిన కోట్ల డబ్బు ఏమైంది? దాచిపెట్టిన డబ్బు ఏమైంది?? .

కోట్లు సంపాదించినా ఆమె కేవలం వేలల్లో పాకెట్ మనీ అడుక్కుని ఎందుకు తీసుకుంటుంది? రూపాయి రూపాయి లెక్కలు ఎవరికి చెప్పింది? ఎన్జీవో కూడా రన్ ఎందుకు చేయలేకపోతుంది. అసలు అంత మనీ ఏమైంది? పిల్లల్ని కని తల్లి అవ్వాలనుకున్న తన ఆశను ఎవరు చంపేశారు. ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు సమంత అంటే ఏమిటో.. ఆమె ఎలాంటిదో..ఇప్పుడు అందరూ సమంతని అనేవాళ్లే. 


 ఎందుకంటే సమంతది పూర్ ఫ్యామిలీ అనే కదా.. ప్రతి ఒక్కరి నోర్లూ లేస్తున్నాయి. సమంతకి ఉన్న మంచి మనసులో 1 పర్సంట్ మీకున్నా.. మీరు గొప్పవాళ్లు అవుతారు. ఆమె డబ్బులు సంపాదించే యంత్రం మాత్రమే. ప్రేమించిన వాడితో విడిపోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. సమంత ఎంత బాధ అనుభవించి ఉంటుంది.

Samantha, Naga Chaitanya officially depart ways .... request to respect their privacy


ఎవడో డిజైనర్‌తో సంబంధం కట్టకండి.. అతను సమంతను అక్క అంటాడు. సమంత పట్ల అవమానకరమైన భాషను వాడొద్దు. కనీసం ఆమె ఇప్పటికైనా ఫ్రీడమ్ దొరికింది. దేవుడు ఆమెను దీవిస్తాడు.. ఆమె మంచి మనసుతో మళ్లీ డబ్బు సంపాదిస్తుంది. అనేకమంది పిల్లలకు సాయం చేస్తుందని నాకు తెలుసు’ అంటోంది మాధవీలత.


 నాగార్జున బాధను మనసులో పెట్టుకుని బిగ్ బాస్ హోస్టింగ్ చేశాడట. వాళ్లు విడిపోయి చాలా కాలం అయ్యింది. ఇప్పుడే కొత్తగా విడిపోలేదు. నాగార్జున కూడా విడాకులు తీసుకున్నవాడే.. అది వాళ్ల పర్సనల్. అప్పుడు జనాలు ఏమీ అనలేదు. ఎందుకంటే నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు కాబట్టి.
 


సమంత చాలా మంచి అమ్మాయి. ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం.. ఆమె మాత్రమే కాదు. సమంత రెండు చేతుల సంపాదిస్తుంది. అలాగే 30 ఏళ్లకే తల్లి అవ్వాలని ఉంది అంటూ ప్రదీప్ షో లో చెప్పిన సమంత కి తల్లి అయ్యేందుకు అనుమతి దొరకలేదు. తల్లి అయితే ఆమె గ్లామర్ పోతుంది అని ఫ్యామిలి భయపడింది. 
 


అలాగే సమంత ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా అనేకమంది పిల్లలకి హర్ట్ ఆపరేషన్స్ చేయించేది. ఆమె ఏ షాప్ ఓపెనింగ్ కి వెళ్లినా దానికి వచ్చే మనీ ప్రత్యుష ఫౌండేషన్ కి నేరుగా వెయ్యాలని చెప్పేవారు. అయితే కోట్లు సంపాదించే సమంత కి పాకెట్ మనీ ఇచ్చారు. ఆమెని కేవలం డబ్బు సంపాదించే యంత్రంగానే చూసారు తప్ప మనిషిగా చూడలేదు.


 ఆమె షాప్ ఓపెనింగ్స్ వెళ్లే డబ్బు కూడా ఆమె ఖాతాలోకి వెళ్ళకపోవడంతో.. ఆ విషయంలో ఆమె చాలా బాధపడింది.  ఇవన్నీ రూమర్స్ కాదు.. ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. సామ్ సన్నిహితులే నాకు ఈ విషయం చెప్పారంటూ మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేసింది.  సమంతకి డబ్బు పిచ్చి లేదు అని కూడ చెప్పింది మాధవీలత.


“సినిమాలు, బ్రాండ్స్ ద్వారా వచ్చే ఆదాయం మినహా… ప్రారంభోత్సవాలు, ఇతర ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తే వచ్చే డబ్బులను ఆమె ప్రత్యూష ఫౌండేషన్ కి దానం చేస్తుంది. సమంత చాలా మంచిది. ఆమె మంచి హృదయమున్న మనిషి,” మాధవీలత సమంతకి ఇలా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. 

Samantha Naga Chaitanya divorce


‘‘విడాకుల గురించి మూడు విషయాలు విన్నాను.. 1) సినిమా వాళ్లు పెళ్లిల్లు చేసుకుంటే కలిసి ఉండరు.. విడిపోతారు.. 2) సామ్ క్రిస్టియన్.. ఈ క్రిస్టియన్స్ ఇలానే ఉంటారు.. 3) పెళ్లి తర్వాత కూడా ఒళ్లు కనిపించేలా గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటుంది.. సినిమా వాళ్లే కాదు.. బయట కూడా సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.


 పెళ్లి బట్టలతోనే వచ్చి విడాకులు కావాలని అడిగేవాళ్లు ఎంతమంది ఉన్నారో డైవర్స్ స్పెషలిస్ట్ లాయర్లను అడిగితే చెప్తారు. వాళ్లతో కంపేర్ చేసుకుంటే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది డైవర్స్ తీసుకుంటారు. సెలబ్రిటీలు కాబట్టి ఎక్కవగా హైలెట్ అవుతుంటారు. రోజూ గొడవలు పడే కంటే మ్యూచ్‌వల్ అండర్ స్టాండింగ్‌తో చాలామంది విడిపోతుంటారు.. అలాంటి వాళ్లు లైఫ్ టైమ్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్లు భార్య భర్తలుగా ఉండలేరా అంటే ఉండలేరు.. ఎందుకంటే ఫ్రెండ్స్ వేరు, పార్టనర్ వేరు.


‘‘పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్ బట్టలేసుకుంటుంది.. అందుకే వదిలేసాడు అంటున్నారు.. అలా అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ని వదిలెయ్యాలి.. దీపిక పదుకొనేని రణ్‌వీర్ సింగ్ వదిలెయ్యాలి.. తెరమీద వేసుకునే బట్టలకి, మొగుడు పెళ్లాల కాపురానికి సంబధముందడదు.. నాగార్జున, రామానాయుడు కూతురు, వెంకటేష్ సిస్టర్‌కి విడాకులిచ్చిన్నప్పుడు ఎవరూ ఆమె గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె ఎవరో పెద్దగా తెలియదు. ఆమె గురించి కానీ నాగార్జున గురించి కానీ మాట్లడలేదు.. ఇప్పుడు సమంత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. 


సమంత, చైతన్యకి కానీ నాగార్జునకి కానీ తెలియకుండా సినిమాలు చెయ్యలేదు. మీరొక్కసారి యాంకర్ ప్రదీప్ షోలో ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. ‘నాకిప్పుడు 29 ఇయర్స్.. 30 ఇయర్స్ వచ్చే సరికి నేను తల్లినవ్వాలి.. ఎందుకంటే నా కూతురికి 15 ఇయర్స్ వచ్చే సరికి నాకు 45 ఇయర్స్ ఉంటే.. తను మమ్మీ లెట్స్ ప్లే సమ్‌థింగ్ అని అడిగితే నేను తనతోపాటు కలిసి ఎనర్జిటిక్‌గా ఆడుకోగలను.. అదే నాకు 50, 55 వచ్చినప్పుడు నా కూతురు పిలిస్తే వెళ్లలేను’.. అని క్లియర్‌గా చెప్పింది.

Samantha


అంటే సమంతకి మధర్ అవ్వడం అనేది చాలా ఇష్టమైన పని.. కానీ ఆమె ప్రెగ్నెంట్ అయితే తనకు సినిమాలు రావు అని తల్లి కాకుండా ఎవరు ఆపారు?.. మీ అందరికీ సమంత బట్టలు మాత్రమే తెలుసు.. ఆమె చాలా మంచిది.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుంటుంది.. సినిమా తప్ప ఇతరత్రా లాంచింగ్ ఈవెంట్స్‌కి సంబంధించిన మీన అంతా కూడా ఆ ఫౌండేషన్ అకౌంట్‌లోనే వెయ్యమని చెప్పేది’’.

Samantha


 ఇక సమంత గ్లామర్ గా డ్రెస్సులు వేసుకుందని విమర్శించే వారికి నేను చెప్పేది ఏంటంటే నాగ చైతన్యకి తెలీదా ఆమె ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుందో. కొత్తగా వచ్చిన సమస్య ఏంటి. అలాగేఆమె హిందూ మతాన్నీ ఎప్పుడూ కించపర్చలేదు. పైగా ఆమె తిరుపతికి కాలి నడకన వెళ్తుంది. పూజలు చేస్తుంది. క్రిస్టియన్ గా పుట్టింది కాబట్టి ఆ మతాన్ని కూడా ఆచరిస్తుంది. పుట్టింటి ధర్మాన్ని, మెట్టింటి ధర్మాన్ని రెండూ బ్యాలెన్స్ చేసింది,” ఇలా సమర్ధించింది  మాధవీలత.

Samantha


గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె డబ్బుని లాగేసాడనే ఆరోపణ కూడా చేసింది మాధవీలత. ఆ హీరో పేరు చెప్పలేదు. గతంలో ఓ హీరోని ప్రేమించి మోస పోయింది.. వాళ్లు కూడా ఆమెను డబ్బుకోసం ఒక మనీ మెషిన్‌లా వాడుకున్నారు.. పెళ్లి తర్వాత కూడా మధర్ అవ్వాలనే ఆశను చంపేసుకుని మరీ రోబోలా పని చేస్తూనే ఉంది.. దయచేసి ఆమె గురించి కామెంట్స్ చెయ్యకండి.


 హెల్పింగ్ నేచర్ కలది.. చాలా మంచి అమ్మాయి.. పెళ్లైన తర్వాత పాకెట్ మనీ ఇస్తారు ఆమెకి.. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం.. కోట్లు సంపాదించి వేలు పాకెట్ మనీ ఇస్తారు.. ఆ డబ్బుతోనే బతకాలి.. అలాంటి బతుకు బతికే కంటే తన లైఫ్ తను చూసుకోవడం చాలా బెస్ట్.. తల్లి అవ్వాలనే ఆశను నెరవేర్చుకోలేదు.. కనీసం సమాజ సేవ చెయ్యడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.


సమంత విషయంలో చాలా చెడుగా మాట్లాడుతున్నారు.. దయచేసి అలా కామెంట్స్ చెయ్యకండి.. రూపాయి బయటకు తియ్యడం ఇష్టం లేని కుటుంబం నుంచి సమంత బయటకు రావడం మంచిదే.. ఇవి నాకు తెలిసిన విషయాలు కాబట్టి మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది మాధవి లత..
 

Latest Videos

click me!